Breaking News

Day: August 11, 2020

కృష్ణం వందే జగద్గురుం​

కృష్ణం వందే జగద్గురుం​

ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ (8వ) సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీమహావిష్టువు ఎనిమిదో అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైంది. అందుకే కృష్ణపరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తిచేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చనలు […]

Read More
తెలంగాణలో 1,896 కరోనా కేసులు

తెలంగాణలో 1,896 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణలో మంగళవారం 1,896 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. కరోనాతో తాజాగా 8 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 645కు చేరింది. కరోనా బారి పడి ఒక్కరోజే 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 22,628 ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 18,035 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో […]

Read More
లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరానికి సమీపంలోని గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సోమవారం ఆకస్మికంగా సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వాగులు, వంకలను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఆరువేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరిందన్నారు. హంద్రీనీవా నదిలో […]

Read More
సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల పంపిణీ

సారథిన్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సోమవారం టీఆర్​ఎస్​ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. 32 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షల 45 వేల చెక్కులను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు రమేశ్​గౌడ్, బండారు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More