Breaking News

Day: August 11, 2020

గుమ్మడిదొడ్డిలో కరోనా టెస్టులు

గుమ్మడిదొడ్డిలో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మదొడ్డి గ్రామంలో వైద్యాధికారులు 42 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో నలుగురికి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా టెస్టులు చేసిన వారిలో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎల్టీ శ్రీనివాసరావు, రాజేష్, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లలిత కుమారి, కోటిరెడ్డి ఉన్నారు.

Read More
అక్కాచెల్లెళ్లకు వైఎస్సార్​చేయూత

అక్కాచెల్లెళ్లకు వైఎస్సార్ ​చేయూత

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో సుమారు 23లక్షల మంది అక్కాచెల్లెళ్లకు నాలుగేళ్లలో రూ.17వేల కోట్ల ఆర్థికసాయం వైఎస్సార్​చేయూత పథకం ద్వారా అందుతుందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ఈ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 […]

Read More

రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్​ మృతి

సారథి న్యూస్​, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్​ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్​ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్​ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
100 ఏళ్ల ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు

వందేళ్ల ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ ఘనపూర్ ఆనకట్టను ఇక నుంచి వనదుర్గా ప్రాజెక్టుగా వ్యవహరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న పలు పథకాలకు ప్రభుత్వం దేవుళ్ల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయం తీసుకున్నారు. నిజాం నవాబుల పాలనాకాలంలో కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై […]

Read More
కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

కృష్ణా నీటి పంపకాల్లో ప్రతికూలత ఉండదు

అమరావతి: కృష్ణానది నీటి పంపకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ ​జగన్​మోహన్​రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ రాసిన లేఖపై మంగళవారం ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని వివరించారు. మొదట అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పిందని గుర్తుచేశారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని వివరించారు. […]

Read More

కరోనాకు జర్నలిస్టు బలి

సారథిన్యూస్ రామగుండం: కరోనా మహమ్మారి ఓ యువ జర్నలిస్టును బలి తీసుకున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాంచందర్​ ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్​ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశాడు. రాంచందర్​ మృతికి గోదావరిఖని ప్రెస్ క్లబ్ నాయకులతోపాటు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More

67 టెస్టులు.. 21 పాజిటివ్​

సారథిన్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రభుత్వా ఆసుపత్రిలో మంగళవారం 67 మందికి కోవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. అలంపూర్​ పట్టణంలో 14 మందికి, శాంతినగర్​లో 1, కాశాపూర్​లో 1, పుల్లూర్​లో 2, బుక్కపూర్​లో 1, పెద్దపోతులపాడులో 1, బైరపూర్​లో 1 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.మనోపాడ్ మండలంలో..36 మందికి టెస్టులు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొన్నిపాడులో 1, పుల్లూర్ 3, మద్దూర్ […]

Read More
ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్​వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ ఒక్కటిగానే పనిచేస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ​మంగళవారం ప్రగతిభవన్​లో సంబంధితశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక […]

Read More