సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. కరోనా విపత్కర సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో ఇదొకటి. వివాదాస్పద అంశాలే కథనంగా ఎంచుకోవడంలో రామ్ గోపాల్ వర్మకు ఎవరూ సాటిరారు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ప్లాట్ఫామ్క్రియేట్ చేసి వరుస చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ అనే సినిమాలను విడుదల చేసిన వర్మ మర్డర్, థ్రిల్లర్ మూవీస్‌ను రిలీజ్ […]
సారథి న్యూస్, రామడుగు: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో విఫలమైన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గద్దె దిగాలని కరీంనగర్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిశేఖర్ విమర్శించారు. ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు అన్న మోడీ, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాట […]
సారథి న్యూస్, రామగుండం: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులో భాగంగా ఆదివారం గోదావరిఖని చౌరస్తా లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మెండ శ్రీనివాస్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. కరోనా కారణంగా నష్టపోతున్న ఆటో, లారీ, భవన నిర్మాణ, హమాలీ, క్వారీ తదితర రంగాల కార్మికులను […]
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో టీటీడీ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటుచేసిన జిల్లా నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. సాగర్ఆయకట్టు కింద సాగవుతున్న పంటలు, నీటి పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యేలు […]
‘మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్లో మహేశ్‌బాబు చేతితో రూపాయి కాయిన్‌ను ఎగరవేస్తూ కనిపిస్తున్నాడు. కేవలం మహేశ్‌బాబు చెయ్యి మాత్రమే కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. కాగా మోషన్ పోస్టర్ చూసి ఫ్యాన్స్ కొంత నిరాశచెందినట్టు సమాచారం. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. సోషల్ మీడియాలో మహేశ్‌కు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 1,982 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 12 మంది మృతి చెందారు. అయితే ఇప్పటివరకు మహమ్మారి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 627కు చేరింది. అయితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 79,495కు చేరింది. కొత్తగా 1,669 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463 నిర్ధారణ […]
సారథిన్యూస్, విజయవాడ: విజయవాడలోని ఓ కోవిడ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు 11 మంది కరోనా రోగులు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ హోటల్ స్వర్ణప్యాలెస్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్నారు. ఈ హోటల్లో దాదాపు 40మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో కరోనా బాధితులు కేకలు పెట్టారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. […]
సారథి న్యూస్, రామడుగు: గ్రామాల్లో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సంప్రదాయ సాగుకే పరిమితమైన రైతులు.. నేడు ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వంగడాల ఎంపిక నుంచి.. కొత్త సాగు పద్ధతుల వరకు కూలీల ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. అందులో భాగంగా కరీంనగర్జిల్లా రామడుగు మండలంలోని చాలా గ్రామాల్లో అన్నదాతలు యంత్రాల సహాయంతో వరినాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ.మూడువేలు ఖర్చవుతోందని, తక్కువ సమయంలో ఎక్కువ పని అవుతోందని, పంట దిగుబడి కూడా బాగా వస్తుందని […]