సారథి న్యూస్, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో సూగూర్ వీఆర్వో రూ. 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకు చెందిన ఆంజనేయులు అనే రైతుకు కొంతకాలంగా అతడి సోదరుల మధ్య భూవివాదం నడుస్తున్నది. వీరి భూసమస్యను పరిష్కరించేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. కాగా, ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం […]
అమరావతి : ఏపీ లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. […]
సారథి న్యూస్, మెదక్, సిద్దిపేట: ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన జర్నలిస్ట్… అణగారిన వర్గాల హక్కుల సాధనకు పోరాడిన ఉద్యమ వీరుడు.. ఎమ్మెల్యేగా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన ప్రజాప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి. అనారోగ్యంతో గురువారం మృతి చెందిన రామలింగారెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో 1961 అక్టోబర్ 2 వ తేదీన సోలిపేట రామక్రిష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు అన్నలు రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి… ముగ్గురు అక్కలు లక్ష్మి, విజయలక్ష్మి, […]
సారథి న్యూస్, సిద్దిపేట: అనారోగ్యంతో మృతిచెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
సారథి న్యూస్, మానవపాడు: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ దివ్య సూచించారు. మానోపాడు పీహెచ్సీ పరిధిలో 75 మందికి పరీక్షలు నిర్వహించగా 21 కేసులు బయటపడ్డాయని చెప్పారు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు , ఆయాసం, జ్వరం ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అమరావతి: కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తేల్చిచెప్పింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావించిన టీడీపీకి ప్రస్తుత బీజేపీ నిర్ణయంతో ఆశలు అడుగంటాయి. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పీవీ కృష్ణయ్య అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 2,092 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 589కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73,050 నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20,358 రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 13,793 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ […]
టాలీవుడ్లో పూజాహెగ్డే, రష్మికా మందన్నా ఎంట్రీతో రకుల్ ప్రీత్‌సింగ్ జోరు తగ్గింది. దీంతో ఆమె టాలీవుడ్‌ను వదిలి ముంబైకి పరుగులు తీసింది. అయితే అక్కడా అవకాశాలు రాకపోవడంతో.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటుంది. ఈ క్రమంలో రకుల్‌కు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు టాక్. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఒలింపిక్ మెడల్ విజేత కరణం మల్లీశ్వరిపై ఓ బయోపిక్‌ను తీయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రకుల్ టైటిల్ రోల్ చేస్తున్నట్టు టాక్. […]