Breaking News

Day: August 2, 2020

మంత్రిని బలితీసుకున్న కరోనా

కరోనాతో మంత్రి మృతి

లక్నో: కరోనా మహమ్మారి సామాన్యులను, ప్రముఖులను సైతం బలితీసుకుంటున్నది. ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనాతో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]

Read More
పేషెంట్లకు వైద్యం బాగుండాలె

పేషెంట్లకు వైద్యం బాగుండాలె

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్​లోని గచ్చిబౌలి టీమ్స్ ఆస్పత్రిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. ప్రతి ఫ్లోర్, రూమ్ ను చాలాసేపు పరిశీలించారు. పేషెంట్ల పట్ల కేర్, వారికి మందులు, వైద్యం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్​క్వాలిటీ బాగుండాలని సూచించారు. వైద్యచికిత్సల కోసం అవసరమైనంత మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతున్న సీపీఎం నేత, […]

Read More
బీజేపీ స్టేట్​కమిటీ నియామకం

బీజేపీ స్టేట్ ​కమిటీ నియామకం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడేందుకు ప్లాన్ ​చేస్తోంది. అందుకు అనుగుణంగా కమిటీలను నియమిస్తోంది. సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​కుమార్​ ఆదివారం పూర్తి కమిటీని ప్రకటించారు. జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జి.మనోహర్​రెడ్డి, బండారు శోభారాణిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి […]

Read More
తెలంగాణలో 1,891 కేసులు

తెలంగాణలో 1,891 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం 1,891 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,677కు చేరింది. తాజాగా 10 మంది కరోనా వ్యాధిబారినపడి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 540కు చేరింది. రాష్ట్రంలో 18,547 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో 1088 మంది డిశ్చార్జ్​అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధితో అత్యధికంగా 517 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. […]

Read More
పిల్లలతో కథలు చదివిద్దాం..రండి

పిల్లలతో కథలు చదివిద్దాం.. రండి

వెబ్​సైట్లలో నీతి కథలు, ఇతిహాసాలు చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం సారథి న్యూస్, రామాయంపేట: కరోనా పుణ్యమా..! అని విద్యార్థులు చదువులు, పరీక్షలు మానేసి ఆన్ లైన్​గేమ్స్ తో స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. పిల్లలు ఇంట్లో ఉన్న డాడీ లేదా మమ్మీ స్మార్ట్ ఫోన్లలో లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్ నెట్ ​ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు. ఆన్​లైన్ లో పిల్లలు ఏవేవో చూసి సమయాన్ని వృథాచేసుకునే బదులు నైతిక విలువలు, మన సంస్కృతి సంప్రదాయలను […]

Read More
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథి న్యూస్, అచ్చంపేట: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదివారం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, బుడ్డతండా, హాజీపూర్ గ్రామాల సర్పంచ్​లకు వినతిపత్రాలు ఇచ్చారు. లాక్​డౌన్ ​సందర్భంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, ప్రైవేట్​ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనాకు ఉచితంగా వైద్యచికిత్సలు అందించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ […]

Read More
కరోనా..జాగ్రత్తలు పాటించండి

కరోనా.. జాగ్రత్తలు పాటించండి

సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్ ​నుంచి జూమ్​యాప్ లో ఉప్పునుంతల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఎస్సై, సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. కరోనా కాలంలో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా చూడాలని కోరారు.

Read More
86కు చేరిన మృతుల సంఖ్య

86కు చేరిన కల్తీ మద్యం మృతులు

చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్​ ‌తరన్‌ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్​ ‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్​చేశారు. ఏడుగురు ఎక్సైజ్‌ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్​ ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. […]

Read More