Breaking News

Month: July 2020

షార్ట్ న్యూస్

ఇంటికే కరోనా కిట్‌

సారథిన్యూస్​, హైదరాబాద్‌: హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్సపొందుతున్న కరోనా బాధితులకు ‘ఐసోలేషన్​కిట్​’ ను ఇంటికే పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కిట్​లో బాధితుడికి అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని కరోనా బాధితుడికి ఉచితంగా అందిస్తుంది. శుక్రవారం కోఠిలోని ఆరోగ్యకార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్​ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు వీలైనంత త్వరలో ఈ కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఐసొలేషన్‌ అవస్థలను తప్పించడానికే..రాష్ట్రంలో రోజురోజుకు […]

Read More

ఢిల్లీలో అన్ని పరీక్షలు రద్దు

ఢిల్లీ: ఢిల్లీకి చెందిన అన్ని యూనివర్సిటీల పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వార్షిక పరీక్షలు, ఇతర పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా శనివారం ట్వీట్​ చేశారు. ఆయా విశ్వవిద్యాలయాలు తమ నిబంధనల ప్రకారం విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్​ చేస్తారని. లేదా వారికి డిగ్రీ పట్టా అందజేస్తారని […]

Read More
మద్యం కోసం కరోనా రోగి సాహసం

మద్యం కోసం కరోనా రోగి సాహసం

న్యూజిలాండ్​: హోం క్వారంటైన్​లో ఉన్న ఓ కరోనా రోగి మద్యం కొనుగోలు చేసేందుకు భారీ సాహసమే చేశాడు. ఇనుపకంచెను తెగ్గొట్టి దాని దాటుకుంటూ వెళ్లి మద్యం కోనుగోలు చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్​లో చోటుచేసుకున్నది. న్యూజిలాండ్​లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి(52) కి ఇటీవల కరోనా సోకగా.. అక్కడి ప్రభుత్వమే అతడిని హోంక్వారంటైన్​లో ఉంచింది. క్వారంటైన్​ కేంద్రం చుట్టూ భారీ ఇనుపకంచెలు కూడా ఏర్పాటు చేశారు. కాగా అందులో ఉంటున్న ఓ కరోనా రోగి మందు తాగాలనిపించంది. […]

Read More
న‌యీం.. దూబేల‌ను పోషించిందెవరు?

న‌యీం.. దూబేల‌ను పోషించిందెవరు?

సారథి న్యూస్​, హైదరాబాద్: కాన్పూర్ కు చెందిన గ్యాంగ్‌స్టర్​ వికాస్‌దూబే ఎన్‌కౌంట‌ర్ ఎన్నో ప్రశ్నలు లేవ‌నెత్తింది. 20 -25 ఏళ్ల కాలంలో ఒక హంత‌కుడు గ్యాంగ్‌స్టర్​గా ఎదిగేంత వ‌ర‌కూ అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. చిన్న దొంగ‌త‌నం చేసిన నేర‌స్తుల‌పైనే పీడీ యాక్టులు విధించే ఖాకీలు ఎందుక‌లా వ‌దిలేశాయన్నది ప్రశ్నార్థకమే. అయితే కాన్పూర్​కు చెందిన వికాస్​ దుబే, తెలంగాణకు చెందిన నయీం ఎదిగిన తీరు ఒకేలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో న‌యీం పోలీసుల కోవ‌ర్టుగా చేసిన సాయానికి […]

Read More
వస్త్రవ్యాపారం.. దివాళా

వస్త్రవ్యాపారం.. దివాళా

సారథి న్యూస్, హైదరాబాద్: వస్త్రవ్యాపారంపై కరోనా పంజా విసిరింది. ఆ రంగం మీద ఆధారపడి జీవించే వ్యాపారులు, వర్తకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రస్తుతం అమ్మకాలు లేక హోల్‌సేల్‌, రిటైల్‌ షాపులు వెలవెలబోతున్నాయి. అరకొరగా వచ్చే వినియోగదారుల నుంచి ఎక్కడ కరోనా అంటుకుందేమోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎంతటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఆ మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుందోనన్న ఆందోళనతో కొద్ది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్లు ప్రకటించి, వారం తర్వాత మళ్లీ దుకాణాలను […]

Read More
ఏది అవసరం?

ఏది అవసరం?

సారథి న్యూస్, హైదరాబాద్: ‘కరోనా కట్టడి కోసం మార్చి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.475 కోట్లను ఖర్చుచేసింది..’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల అధికారికంగా చేసిన ప్రకటన ఇది. కానీ ఇంతకు మించి నూతన సచివాలయ నిర్మాణం కోసం సర్కారు ఏకంగా రూ.500 కోట్లను కేటాయించడం గమనార్హం. ఏడాది కాలంలో దీన్ని పూర్తిచేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంచనాలు రూ.వెయ్యి కోట్ల దాకా ఎగబాకే అవకాశాలు లేకపోలేదని ఆర్థికశాఖ అంచనా. దీన్నిబట్టి కరోనా నివారణ, […]

Read More
గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​బస్సు

గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​ బస్సు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్​ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్​పరారీలో ఉన్నారు.

Read More
గుడి కూలింది... సర్కారూ కూలబోతోంది

‘గుడి కూలింది.. సర్కారూ కూలబోతోంది’

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మహబూబ్​నగర్ , నల్లగొండ జిల్లాల వర్చువల్ ర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్​: సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారని, అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. తొందర్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారుకు దినాలు పెట్టడానికి రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుడిని కావాలనే కూలగొట్టి, తప్పిపోయి కూలిపోయిందని అబద్ధాలు చెబుతున్నారని ఆయన తీవ్రంగా […]

Read More