Breaking News

Month: July 2020

ఒకే రోజు 50 వేల కేసులు

ఒకేరోజు 50వేల కేసులు

ఢిల్లీ : మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 49,931 కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే 13లక్షల నుంచి కేసుల సంఖ్య 14 లక్షలకు చేరింది. కాగా, దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 32,771 కు పెరిగింది. ఇప్పటివరకు 9,17,567 మందికి రోనా నయం కాగా, ప్రస్తుతం 4,85,114 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

Read More
తుంగభద్రలో గాలింపు చర్యలు

తెలియని నాగ సింధూరెడ్డి ఆచూకీ

తుంగభద్ర నదిలో విస్తృతంగా గాలింపు కలుగొట్ల సమీపంలో వాగులో గల్లంతు పర్యవేక్షిస్తున్న జోగుళాంబ గద్వాల ఎస్పీ సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల సమీపంలో వాగులో మూడు రోజుల క్రితం కొట్టుకుపోయిన నాగసింధూరెడ్డి ఆచూకీ కోసం తుంగభద్ర నదిలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలతో గాలింపు చేపట్టారు. కలుగోట్ల వాగులో కొట్టుకుపోయిన స్థలం నుంచి తుంగభద్ర నది తీరం వరకు జేసీబీ వెహికిల్​తో […]

Read More
మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా మృతి

ఒరిగిన పోరు కెరటం

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా ఇకలేరు శానససభలో ప్రజల తరఫున తనదైన గళం చివరి శ్వాసదాకా ప్రజా ఉద్యమాల్లోనే.. నిజాయితీయే ఆస్తి సారథి న్యూస్​, ఇబ్రహీంపట్నం: పోరు కెరటం నెలకొరిగింది.. ప్రజాగొంతుక మూగబోయింది.. దళిత కిరణం ఆరిపోయింది.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహా ఇక లేరు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. […]

Read More
హంద్రీనీవా ఉగ్రరూపం..

హంద్రీనీవా ఉగ్రరూపం..

సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలుకు సమీపంలో ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో హంద్రీనీవా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో నగరంలోని బుధవారంపేట, జోహారపురం, బాపూజీ నగర్, జమ్మిచెట్టు తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీ జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. […]

Read More

భూతగాదాలతో దాడులు

సారథి న్యూస్, రామడుగు: భూ తగాదాలు రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వేదిర గ్రామానికి చెందని చెందిన కాసర్ల మనెమ్మ, గుర్రాల పద్మ తమ వ్యవసాయం పొలాన్ని ట్రాక్టర్​తో దున్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందని దొడ్డ శ్రీనివాస్​రెడ్డి, దొడ్డ సుధాకర్​రెడ్డి అక్కడికి వచ్చి ఈ పొలంలో తమకు వాటా ఉందంటూ మణెమ్మ, పద్మపై వ్యవసాయ పనిముట్లతో దాడిచేశారు. దీంతో వీరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు గమనించి […]

Read More
చెరువులు, కుంటలకు జలకళ

చెరువులు, కుంటలకు జలకళ

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పల్లెచెరువు, మాదిగవాని కుంట, కొత్తచెరువు, పందిల్ల, అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, మల్లంపల్లి, నక్కలకుంట, తాళ్లచెరువు, కొహెడ మండలంలోని బస్వాపూర్, శనిగరం, బెజ్జంకి మండలం బేగంపేట పాతచెరువు, దాచారం, బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిళ్ల, ముత్తన్నపేట, మద్దూర్ మండల పరిధిలోని కుటిగల్, గాగిళ్లపూర్, బైరాన్​పల్లి గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నిండి […]

Read More
సోనూసూద్​ రియల్​హీరో

సోనూసూద్​ రియల్​హీరో

ఆపదలో ఎవరున్నా తక్షణం స్పందించే నటుడు సోనూసుద్​.. మరోసారి రియల్​ హీరో అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్​ రాజపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్​రావు అనే రైతుకు పొలం దున్నేందుకు ఎద్దులు లేవు. దీంతో తన కుమార్తెలను కాడెద్దులుగా చేసుకుని పొలాన్ని దున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ట్విట్టర్​లో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ వీడియోను సోనూసూద్​కు ట్యాగ్​ చేశాడు. దీంతో చలించిపోయిన ఆయన నాగేశ్వర్​రావుకు సాయం చేయాలనుకున్నాడు. […]

Read More
షూటింగ్​కు రెడీ

షూటింగ్​కు రెడీ

టాలీవుడ్ హీరోలెవరూ షూటింగ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ కన్నడ హీరోలు మాత్రం షూటింగ్​కు సై అంటున్నారు. రీసెంట్ గా సుదీప్ కిచ్చా ‘ఫాంటమ్’ సినిమా షూటింగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుపెట్టి షాకిచ్చారు. ఈ బాటలోనే మరో కన్నడ హీరో ఉపేంద్ర కూడా వస్తున్నారు. వెర్సటైల్ హీరో ఉపేంద్ర నటిస్తున్న ‘కబ్జా’ చిత్రంతో పాటు తెలుగులో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ […]

Read More