Breaking News

Month: July 2020

డాక్టర్​ పాడుపని

కీచక వైద్యుడు

నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్​బెడ్​ షేరింగ్​రూమ్​) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా […]

Read More
వీధి వ్యాపారులకు ఢిల్లీ ప్రభుత్వం ఊరట

వీధి వ్యాపారులకు ఊరట

అరవింద్​ కేజ్రీవాల్​ ఢిల్లీ ముఖ్యమంత్రి

Read More
దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య

47 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 47,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు చేరింది. వరుసగా ఆరోరోజు 45 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికి 33,425 మంది కరోనాతో మృతిచెందారు. 9,52,743 మంది డిశ్చార్జి కాగా.. 4,96,988 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
విల్లు ఎక్కుపెట్టిన పౌరుషం

విల్లు ఎక్కుపెట్టిన పౌరుషం

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్​ను సోమవారం విడుదల చేశారు. కేతికశర్మ హీరోయిన్. నారాయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్​రావు, శరత్ మరార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగశౌర్య కెరీర్​లో ఇది 20వ సినిమా. అయితే నిర్మాతల్లో ఒకరైన నారాయణదాస్ కె.నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లుక్​ను ఆవిష్కరించారు. ‘అశ్వత్థామ’ సినిమాతో మాస్ ఇమేజ్​కు మారిన నాగశౌర్య ఈ […]

Read More
స్వచ్ఛందంగా లాక్ డౌన్

స్వచ్ఛందంగా లాక్ డౌన్

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. స్థానిక పీ‌హెచ్‌సీ లో రాపిడ్ టెస్ట్ లు ప్రారంభించడంతో స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు సైతం టెస్ట్ లు చేయుంచుకుంటున్నారు. దీంతో కేసులు కొత్తగా వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల నుంచి మొత్తం ఐదుకేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీ కావడం తో […]

Read More
సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించింది. సోము వీర్రాజు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కత్తెరు గ్రామం. ఆయన ఎంతోకాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీ పట్ల విధేయతగా పనిచేస్తున్న ఆయనకే బాధ్యతలను కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

Read More
సరళాసాగర్ నీటి విడుదల

సరళాసాగర్ నీటి విడుదల

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్​రిలీజ్​ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

Read More
అనుక్షణం అలర్ట్​గా ఉండాలి

ఎనీటైం అలర్ట్​గా ఉండాలి

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లాతో పాటు ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గతేడాది ఫ్లాష్ ఫ్లడ్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్​ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, సుంకేసుల, గాజులదిన్నె డ్యాములు, వెలుగోడు, గోరకల్లు, పోతిరెడ్డిపాడు, అవుకు, కృష్ణగిరి, పందికోన హంద్రీ రిజర్వాయర్లు, తుంగభద్ర, […]

Read More