సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్ లో పలువురు ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసి మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ […]
ఇండస్ట్రీలో అందరూ ఒక్కసారిగా వెబ్ సిరీస్ లపై పడుతున్నారు. టాప్ హీరోయిన్లు కూడా ఆ దారే అంటున్నారు. కొందరు హీరోయిన్లు అయితే తాము వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు రెడీగా ఉన్నామంటూ ప్రకటిస్తూ ఆఫర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు కూడా. వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన హీరోయిన్లలో నితిన్ సినిమా ‘లై’లో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా లిస్టులో జాయినైంది. అవడానికి తమిళ అమ్మాయే అయినా తెలుగు సినిమాతోనే పరిచయమైంది. పేట, తూటా, బూమరాంగ్, శాటిలైట్ […]
బాలీవుడ్ సీనియర్ నటీ భాగ్యశ్రీ పేరు ఎవరికీ పరిచయం చెయ్యనక్కర్లేదు.1989లో విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ ‘మైనే ప్యార్ కియా’తో భాగ్యశ్రీ ఒక్కసారిగా ఎంతో క్రేజ్ సంపాదించింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు తక్కువ చేసింది. అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్న భాగ్యశ్రీ మళ్లీ పాన్ ఇండియా మూవీతో వెండితెర పైకి రానుంది. ఈమె ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ‘రాధేశ్యామ్’లో కీలకపాత్ర పోషిస్తుంది. రీసెంట్గా భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురువారం 45వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూర్య అభిమానులకు వరుసగా మూడు సర్ప్రైజ్ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఖాతాను తెరవడం, రెండోది ‘ఆకాశం నా హద్దురా’ సినిమా నుంచి కాటుక కనులే అంటూ సాగే పాట ప్రోమో విడుదల చేయడం.. మూడవది వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘వాడి వాసల్’ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ‘వాడి వాసల్’ లుక్ లో పల్లెటూరి వాడిలా […]
జైపూర్: సచిన్ పైలట్ దురాశ వల్లే రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అతను మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటే తాను ఆహ్వానిస్తానని చెప్పారు. కాంగ్రెస్ జాతీయపార్టీ అని.. ఇక్కడ వేచి చూస్తే తగిన సమయంలో పదవి దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడలను ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్ పైలట్‌కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత […]
ఢిల్లీ: కరోనాతో బాధపడుతూ దవాఖానలో చేరిన ఓ బాలిక(14)ను మరో కరోనా పేషెంట్ లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కోవిడ్ కేర్సెంటర్లో గురువారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్ సెంటర్లో చికిత్సపొందుతున్నది. కాగా అక్కడే చికిత్సపొందుతున్న మరో కరోనా బాధితుడు బాలికపై టాయిలెట్రూంలో లైంగికదాడికి యత్నించాడు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాలిక కేకలు పెట్టడంతో ఇతర రోగులు అక్కడికి […]
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకున్నది. కరోనా నిర్ధారణ అయిన రోగుల ఇండ్లను మున్సిపల్ సిబ్బంది మెటల్‌తో సీలు చేశారు. బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న రెండు కుటుంబాలవారికి కరోనా సోకింది. దీంతో మున్సిపల్ సిబ్బంది వారి ఇండ్ల తలుపులకు ఇనుప రేకులను బిగించి వాటిని మేకులతో కొట్టి బిగించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై సోషల్ […]