Breaking News

Day: July 23, 2020

ధైర్యంగా ఉండాలె

సారథి న్యూస్​, రామగుండం: కరోనా బాధితులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. తగిన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని చెప్పారు. దేశంలో కరోనా బారినపడి ఎంతో మంది 85 శాతంపైనే కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. గురువారం సీపీ ఆదేశాల మేరకు డీసీపీ అశోక్​కుమార్ నేతృత్వంలో ​ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయి చికిత్సపొందుతున్న పోలీసులకు రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, డ్రైఫ్రూట్స్​, టాబ్లెట్స్​ అందజేశారు. కరోనా బారినపడ్డ ప్రతి పోలీసు​కు […]

Read More

మొక్కల సంరక్షణ మన బాధ్యత

సారథిన్యూస్​, పెద్దపల్లి: మొక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పర్యావరణహితం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మైడిపల్లి వద్ద గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం గత ఆరేండ్లలో 150 కోట్ల మొక్కలను నాటిందని ఆయన చెప్పారు. అంతకుముందు మంత్రి అంతర్గాం మండలంలోని కందనపల్లిలో మంత్రి పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయా […]

Read More

విద్యార్థులే తెలంగాణ సంపద

సారథిన్యూస్, చొప్పదండి: విద్యార్థులే తెలంగాణ సంపద అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో ఛైర్మన్ మల్లారెడ్డి, నాయకులు గొల్లపల్లి శ్రవణ్, తోట శేషాద్రి, మాచర్ల వినయ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

ఇప్పుడేం చెప్పలేం..

సారథి న్యూస్, హైదరాబాద్ : విద్యాసంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభమనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నివేదికలో తెలిపింది. కరోనా తీవ్రత వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా విద్యాసంవత్సరం ఖరారు చేయలేదని చెప్పింది. అనువైన విద్యాసంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని కోర్టుకు విన్నవించింది. అదనపు ఆర్థికం భారం లేని బోధన పద్ధతులపై కసరత్తు జరుగుతోందని తెలిపింది. విద్యాసంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్‌ తరగతులపై మార్గదర్శకాలు జారీచేస్తామని […]

Read More

చరణ్, వెంకీ.. సినిమా

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, తండ్రి చిరంజీవి ‘ఆచార్య’మూవీలో కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడని కన్ఫామ్ అయ్యింది. అయితే దాని నిర్మాణ బాధ్యతలు చరణే చూసుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పటి నుంచో లిస్ట్‌లో ఉన్నా.. వీటి తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అన్న విషయం పై చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. దీని గురించి చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు […]

Read More

‘ఉస్మానియా’ పురావస్తు భవనం కాదా?

సారథి న్యూస్, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కూల్చివేయాలని ఓ వాదన.. పురాతన భవనమని మరో వాదన ఉందని వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఈ ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ.6కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని […]

Read More
తమిళనాడు రాజ్​భవన్​లో 84 మందికి కరోనా

రాజ్​భవన్​లో 84 మంది కరోనా

చెన్నై: తమిళనాడు గవర్నర్​ అధికారిక నివాసం రాజ్​భవన్​లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్​భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్​ బన్వర్​లాల్​ పురోహిత్​ను కాంటాక్ట్​ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Read More

సచిన్​పైలట్​కు ఊరట

ఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్​ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్​ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సచిన్​ పైలట్​ వర్గానికి మరోసారి ఊరట లభించింది. స్పీకర్​ లేవనెత్తిన అంశాలపై సుధీర్ఘ విచారణ చేపడతామని […]

Read More