సారథి న్యూస్, రామడుగు: ప్రస్తుతపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ఎమర్జెన్సీని ప్రకటించాలని కరీంనగర్ జిల్లా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మచ్చ రమేశ్, ఏగుర్ల మల్లేశ్, వేముల మల్లేశం, పారునంది మొండయ్య,ఉమ్మెంతుల రాజిరెడ్డి,రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల గోపాల్రావుపేటలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళితనేత దివంగత మైసన్న సేవలు మరువలేనివరి దళితసంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్లో మైసన్న వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ దళితసంఘాల నాయకులు పోగుల రంగయ్య, కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య. దుబాసి బొందయ్య, శంకర్, రామునాయక్, సిద్ధార్థ, శనిగరపు రామస్వామి. లచ్చులు, గంటయ్య, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ హామీమేరకు సింగరేణికి చెందిన కార్మికులకు రూ.210 కోట్లు వెచ్చించి నూతన క్వార్టర్లు నిర్మించి ఇస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ బోర్డు డైరెక్టర్లు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి విద్యాసంస్థలకు రూ. 45 కోట్లు కేటాయించేందుకు, సింగరేణిలో ప్రత్యేకపర్యావరణశాఖ ఏర్పాటు చేసేందుకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. సమావేశంలో బోర్డు సభ్యులు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ రాజీవ్ రంజన్ మిశ్రా, కేంద్ర బొగ్గు […]
రిసోర్సెస్ డిపార్టుమెంట్ గా మార్పు ఈఎన్సీలకు కీలక బాధ్యతలు విస్తృతస్థాయి సమావేశం సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతోందని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలని, వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవని స్పష్టంచేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నారు. అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కరోనాతో వాయిదాపడింది. ఈ సినిమాలో పవన్‌తో జోడీ కట్టేందుకు ఇంకా ఎవరినీ అధికారికంగా నిర్ణయించలేదు. తమిళంలో అజిత్‌తో వచ్చిన ‘నేర్కొండ పార్వై’ చిత్రంలో అజిత్ సరసన విద్యాబాలన్ నటించారు. అయితే పవన్ పక్కన శృతిహాసన్ ను సెలెక్ట్ చేశారన్న వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొట్టింది. అప్పుడా వార్తలను శృతిహాసన్ కొట్టి పారేసింది. ఇప్పుడేమో ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ […]
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో కలిసి పనిచేయనున్నాడట. అయితే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయేనట. ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తీస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాన్స్, కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్’అని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యతలను మండల తహసీల్దార్‌కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలుకానుండడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది పెళ్లికొడుకు, పెండ్లికూతురు తరఫున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. పెండ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న […]