Breaking News

Day: July 18, 2020

టీఆర్ఎస్​ఆఫీసులు రెడీ

టీఆర్ఎస్ ​ఆఫీసులు రెడీ

సారథి న్యూస్, జనగామ: టీఆర్ఎస్ ​పార్టీ జనగామ జిల్లా ఆఫీసును పంచాయతీ రాజ్ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పరిశీలించారు. నెలరోజుల్లో మూడు ఆఫీసులను మంత్రి కేటీఆర్​చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. భూపాలపల్లి, హన్మకొండ(వరంగల్) పార్టీ ఆఫీసు పనులు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు. పనులు మరింత నాణ్యవంతంగా ఉండాలని సూచించారు.

Read More

ఉత్తరాఖండ్​లోనూ వీకెండ్​ లాక్​డౌన్​

డెహ్రాడూన్​: కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. నాలుగు జిల్లాల్లో శని, ఆదివారాల్లో లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న డెహ్రాడూన్, హరిద్వార్​, ఉధమ్​సింగ్​ నగర్​, నైనిటాల్​లో లాక్​డౌన్​ కొనసాగనున్నది. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి, వ్యవసాయపనులకు, నిర్మాణరంగ పనులకు మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలు, హోటల్లు తెరుచుకోవచ్చు. అయితే మిగతా ప్రైవేట్​ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్​ మాల్స్​ మూసేయాల్సిందే. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]

Read More
మనస్సున్న మహారాజులు.. ఈ వైద్యులు

వైద్యులు ఎంతగొప్ప పనిచేశారో..

సారథి న్యూస్​, హైదరాబాద్​: వారంతా ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసే డాక్టర్లు.. ఆ వృత్తిలో వారంతా నిష్ణాతులు. రోగులు, చికిత్సలు, శస్త్రచికిత్సలతో క్షణం తీరిక లేకుండా గడిపే వైద్యులు. కరోనా కష్టకాలంలోనూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు ఆయువు పోస్తున్న సేవాతత్పరులు. కోవిడ్‌-19 రాష్ట్రంలో వ్యాపించినప్పటి నుంచి వంతుల వారీగా డ్యూటీలు చేస్తూ.. వైరస్‌ విజృంభణతో కుటుంబాలకు దూరంగా గడుపుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కార్యదీక్షులు. ఈ క్రమంలో కరోనాకు చికిత్సలు అందించే డాక్టర్లు అత్యంత […]

Read More

ఆడియో టేపులపై సీబీఐ విచారణ

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షేకావత్​ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్​ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే ఆ వాయిస్​ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్​ పాత్రా డిమాండ్​ చేశారు.

Read More
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ భూకంపం

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ భూకంపం

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కట్రాకు 88 కి.మీ.దూరంలో తెల్లవారుజామున 4.55 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధకారులు చెప్పారు. గురువారం కూడా జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. జూన్ 27వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాల్లో వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుస భూకంపాలతో […]

Read More
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ముంబై: బిగ్​ అమితాబచ్చన్​ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్​తోపాటు ఆయన కుమారుడు అభిషేక్​, కోడల్​ ఐశ్వర్యరాయ్​, మనుమరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా అమితాబ్​, అభిషేక్​ దవాఖానాలో చికిత్స పొందుతుండగా.. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతే ఐశ్వర్యరాయ్​, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఐశ్వర్యకు కొన్ని లక్షణాలు బయటడపడటంతో ఆమె ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఐశ్వర్యతోపాటు ఆమె కూతురు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.

Read More
జాన్​ లూయిస్​ మృతి

జాన్​లూయిస్​ ఇకలేరు

వాషింగ్టన్​: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్​ సభ్యుడు జాన్​ లూయిస్​(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్​ కేన్సర్​తో బాధపడుతున్నారు. జాన్​ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్​ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్​ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్​ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్​ […]

Read More
మాస్క్ తప్పనిసరి

మాస్క్ తప్పనిసరి

అమరావతి: ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి కట్టుకోవాలని చేస్తూ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సూచించారు. కోవిడ్​–19 మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. వ్యాధి నివారణకు కఠినచర్యలు తప్పవని స్పష్టంచేసింది.

Read More