Breaking News

Day: July 17, 2020

ఎంతమందికైనా వైద్యం

ఎంత మందికైనా వైద్యం

కరోనాకు ప్రభుత్వాసుపత్రుల్లో మంచి ట్రీట్​మెంట్​ ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవద్దు కరోనా కోసమే రాష్ట్రవ్యాప్తంగా 10వేల బెడ్లు పీహెచ్​సీల్లో ఖాళీగా ఉన్న 200 డాక్టర్​ పోస్టుల భర్తీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనాకు ప్రజలు భయాందోళనకు గురికావదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కరోనా వైరస్ సోకినవారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చికిత్స […]

Read More
ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు డ్రాప్​ అవుట్స్ ​తగ్గించడం.. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త భవనం మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాప్​అవుట్స్​ పెరిగిపోతున్నారని వివరించారు. […]

Read More
రూ.1.8 కోట్ల నగదు సీజ్​

రూ.1.8 కోట్ల నగదు సీజ్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల టోల్ గేట్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.1.80 కోట్ల నగదును పాణ్యం పోలీసులు శుక్రవారం సీజ్​చేశారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు కారులో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును ఇన్​కంటాక్స్​అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. నగదును తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ ను విచారించగా హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు తీసుకెళ్తున్నట్లు చెప్పాడని పాణ్యం సీఐ జీవన్ గంగానాథ్​బాబు తెలిపారు.

Read More
నాగర్​ కర్నూల్​ కలెక్టర్​గా శర్మన్​బాధ్యతల స్వీకరణ

నాగర్​కర్నూల్​ కలెక్టర్​గా శర్మన్ ​బాధ్యతల స్వీకరణ

సారథి న్యూస్, నాగర్ కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​గా ఎల్.శర్మన్ ​శుక్రవారం కలెక్టరేట్​లోని తన చాంబర్​లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఓ గర్భిణికి అవసరమైన ‘ఓ’ నెగిటివ్ ​బ్లడ్​ను స్వయంగా డొనేట్​ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ శర్మన్​ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. కరోనా మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More
వారికి మాస్క్‌ పాఠం

వారికి మాస్క్‌ పాఠం

ఇండియాలో ఇటీవల కాలంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 9.50లక్షల మంది కరోనా బారినపడ్డారు. 25వేల మంది దాకా మృత్యువు పాలయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రజలకు అనేక రకాల సూచనలు చేస్తున్నాయి. కానీ, చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో కోవిడ్‌ వైరస్‌ చాలా ఉధృతంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడికి ప్రధానంగా అందరూ మాస్కులు కట్టుకోవాలని ప్రభుత్వాలు నిర్దేశించాయి. మాస్కు లేకుండా బయటకు వెళ్తే జరిమానాలు […]

Read More
విలేజ్ లెర్నర్స్ సర్కిల్ షురూ

విలేజ్ లెర్నర్స్ సర్కిల్ షురూ

సారథి న్యూస్, కల్వకుర్తి: ట్రూ టీచర్స్ కోయెలేషన్ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్ జిల్లా వంగూరు మండలం గాజర గ్రామంలో శుక్రవారం విలేజ్ లెర్నర్స్ సర్కిల్ ను సర్పంచ్ కొమ్ము లక్ష్మమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చదువులకు దూరమవుతున్న పిల్లల కోసం విద్యాకేంద్రం ప్రారంభించి, చదువు చెప్పించడం శుభపరిణామమన్నారు. సర్కిల్ కు అన్నివిధాలుగా సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ట్రూ టీచర్స్ కోయెలేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరెకంటి మల్లయ్య స్వేరో మాట్లాడుతూ.. […]

Read More
నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్​ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన […]

Read More
అది ప్రభుత్వ నిర్ణయం

అది ప్రభుత్వ నిర్ణయం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. సచివాలయం నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోదని అత్యున్నత న్యాయం స్థానం స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు తీర్పు సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసే వారికి చెంపపెట్టు అని టీఆర్​ఎస్ […]

Read More