ఈ ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాల కంటే కలెక్షన్ల విషయంలోనూ ముందుంది ఈ సినిమానే. సినిమా నిర్మాతలత పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి లాభాలు గడించారు. అయితే ఇటీవల తెలుగులో రిలీజైన ప్రతి సినిమాపై దృష్టి పెడుతున్నారు బాలీవుడ్ డైరెక్టర్లు.. హీరోలు. ఇక అక్కడి నిర్మాతలైతే సినిమా హిట్ అయితే […]
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత 35 రోజుల్లో ఇంత తక్కువ కేసులు రావడం ఇదే ప్రథమం. కాగా ఇక్కడ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. 91,312 మంది కరోనా చికిత్సపొంది కోలుకున్నారు. రికవరి రేటు 80.28 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. అధికంగా టెస్టులు చేయడం, పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం చేయడంతోనే కరోనా అదుపులో […]
టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్ ఓ వేశ్య పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. రకుల్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. అన్ని భాషాల్లోనూ ఆమె గ్లామర్‌డాల్ గానే కనిపించిందే తప్ప నటనకు అవకాశం ఉన్న ఒక్కపాత్ర ఆమెకు దక్కలేదనే చెప్పాలి. తెలుగులో పూజాహెగ్గే, రష్మిక మందన్నా వంటి హీరోయిన్ల ఎంట్రీతో రకుల్‌కు అవకాశాలు తగ్గాయి. తమిళంలోనూ ఆమెకు అవకాశాలు దక్కడం లేదు. దీంతో నటనకు అవకాశం ఉన్న ఓ వేశ్యపాత్రలో […]
సారథి న్యూస్, జనగామ: జనగామ జిల్లా కొండకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామం నుంచి మంగళవారం కొండకండ్ల మండల కేంద్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్నారు. మార్గమధ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలను చూసి కారు ఆపారు. వారికి మాస్కులు లేకపోవడంతో వాటిని పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కూలీలకు సూచించారు.
అమరావతి: పార్టీ ఏదైతేనేం తమ పట్టు నిలుపుకోవాలనుకునే వారు ఆ నేతలు. అధికారం తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. పట్టు సాధించడం కోసం ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టాలోనని నిత్యం ఆలోచిస్తుంటారు. వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా అదే పరిస్థితి. ఒకే పార్టీలో ఉన్నా అదే పరిస్థితి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరివీ భిన్నధృవాలు. పోటాపోటీగా బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకుందామని సవాల్ విసురుకునేవారు. అటువంటిది ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అయింది ఏపీలోని యువజన శ్రామిక రైతు పార్టీ పరిస్థితి. ఓ ఎంపీపై వేటు వేసేందుకు వేసిన ప్లాన్ బెడిసికొట్టి ఆ పార్టీ గుర్తింపే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ పార్టీ పెద్దలు సీన్ రివర్స్ అయిందేంటబ్టా! అని తలలు పట్టుకుంటున్నారు. కొంతకాలం నుంచి జగన్ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ […]
ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9,06,752 కేసులు నమోదయ్యాయి. గత 20 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికవరీరేటు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ కేసులు సంఖ్య పెరుగటం ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో 28,000 కొత్తకేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23,727 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 5,71,459 మందికి కరోనా రోగులకు వ్యాధి నయమైంది. కాగా 3,11,565 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
పాట్నా: బీహార్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది. దీనిపై ఆ రాష్ట్ర సీఎస్ దీపక్ కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నారు. పెరుగతున్న కేసుల దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉంది’ అని ఆయన తెలిపారు. అయితే […]