Breaking News

Day: July 4, 2020

వివేకానంద జీవితం ఆదర్శప్రాయం

సారథి న్యూస్​, కరీంనగర్​: స్వామి వివేకానంద సూక్తులు యువత పాటించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్​, అలువాల విష్ణు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా వెదిర క్రాస్​రోడ్డు వద్ద వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవిత చరిత్రను అందరూ చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ […]

Read More

వృద్ధులకు మాస్కుల పంపిణీ

సారథి న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో వృద్ధులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో వృద్ధులకు మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు సర్పంచ్​ లింగంగౌడ్​ తెలిపారు. అనంతరం సర్పంచ్​ గ్రామంలో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రేణుక, సర్పంచ్​ లింగంగౌడ్​, ఉపసర్పంచ్​ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Read More
కర్నూలు మెడికల్​కాలేజీకి 2 డీఎం సీట్లు

కర్నూలు మెడికల్ ​కాలేజీకి 2 డీఎం సీట్లు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు మెడికల్​ కాలేజీ నెఫ్రాలజీ విభాగానికి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కు రెండు సీట్లు అప్రూవల్ వచ్చాయని డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్​ పి.చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇన్నిరోజుల తర్వాత అప్రూవల్​వచ్చిందన్నారు.

Read More
బియ్యం త్వరగా ఇవ్వాలె

బియ్యం త్వరగా ఇవ్వాలె

సారథి న్యూస్, మెదక్: రైస్ మిల్లర్లు ఫుడ్ కార్పొరేషన్ కు బియ్యం త్వరగా సరఫరా చేయాలని మెదక్​ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆదేశించారు. వానాకాలం బియ్యం సేకరణపై శనివారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్లిష్టసమయంలోనూ టార్గెట్ మేరకు ధాన్యం సేకరించినందుకు మిల్లర్లను అభినందించారు. బియ్యం కూడా త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాకు అదనంగా కేటాయించిన రా బియ్యం 2,700 టన్నులను బాయిల్డ్ మిల్లర్లు ఈనెల 15 వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అందజేయాలని […]

Read More
కరోనా @ 1,850

కరోనా.. హైరానా

సారథి న్యూస్, తెలంగాణ: తెలంగాణలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదుతున్నాయి. శనివారం 1,850 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇప్పటివరకు 22,312కు కేసులు చేశారు. 1,342 మంది ట్రీట్​మెంట్​అనంతరం డిశ్చార్జ్​అయ్యారు. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 288 మంది మృతిచెందారు. అత్యధికంగా జీహెచ్​ఎంసీ నుంచి 1,572 కేసులు, జిల్లాల వారీగా.. రంగారెడ్డి 92, మేడ్చల్​53, వరంగల్​అర్బన్​31, కరీంనగర్​18, నిజామాబాద్​17 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read More
చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత

చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత

సారథి న్యూస్, వరంగల్(మహబూబాబాద్): ప్రస్తుతం స్కూళ్లు లేకపోవడంతో విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ఆ సరదానే వారి ప్రాణాలు తీస్తోంది. మహబూబాబాద్ మండలం శనగపురం గ్రామశివారు బోడతండా సమీపంలో తుమ్మలచెరువులోకి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఇటీవల భారీగా వర్షం కురిసింది. దీంతో తుమ్మలచెరువులోకి భారీగా వరదనీరు చేరింది. సమీపంలో ఉన్న బోడ తండాకు చెందిన నలుగురు చిన్నారులు బోడ జగన్(12), బోడ దినేష్(13), ఇస్లావత్ లోకేష్(13), ఇస్లావత్ రాకేష్ (12) ఈతకు వెళ్లారు. నీటిలోకి […]

Read More
దొడ్డి కొమురయ్యకు ఘననివాళి

దొడ్డి కొమురయ్యకు ఘననివాళి

సారథి న్యూస్, చొప్పదండి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కరీంనగర్​జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో శనివారం కురుమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కచ్చు అనిల్, కచ్చు సతీష్, ఏముండ్ల రాజు, జగన్, నిట్టూ మునేశ్, దయ్యాల సాగర్, నరేష్, రాజశేఖర్, సతీష్, బీరేశ్ పాల్గొన్నారు.

Read More
బాధితురాలిని తరలించాలంటూ ధర్నా

బాధితురాలిని తరలించాలంటూ ధర్నా

సారథి న్యూస్, నడిగూడెం(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్​ అని తేలింది. కాగా ఆమె తన సొంత ఇంట్లో హోం క్వారంటైన్​లో ఉంటుంది. ఈ సందర్భంలో ఆమె నివాసముంటున్న వీధిలోని ప్రజలు శనివారం బాధితురాలిని అక్కడి నుంచి తరలించాలంటూ స్థానిక తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పినప్పటికీ స్థానికులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. రోడ్డుపైనే […]

Read More