సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్–19 నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైజానాథ్ విమర్శించారు. ప్రతి ఇంటిలో కోవిడ్ టెస్ట్చేస్తున్నారని, అంతటితో సరిపెట్టకుండా మందు అందజేసి, ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజాప్రతినిధులకు ఇసుకే కల్పవృక్షంగా మారిందన్నారు. సారా తయారీ, అక్రమ ఇసుక సరఫరాను అధికార పార్టీ నాయకులే […]
సారథి న్యూస్, కర్నూలు: అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అమరావతి సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఏపీ ఆప్కాస్ ను ప్రారంభించి 50,449 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థలో […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. మేడ్చల్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు తేలడంతో వైద్యసిబ్బంది హోం క్వారంటైన్ ముద్రవేశారు. అయినప్పటికీ సదరు వ్యక్తి నార్లాపూర్ లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లడంతో శుక్రవారం వారిని కూడా వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు.
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభం ఇప్పుడు పసిపిల్లలపైనా పడింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు తరుచూ ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు గంటల తరబడి ఉండాల్సి వస్తున్నది. దీంతో పిల్లల కళ్లపై తీవ్ర భారం పడతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎనిమిది గంటలపాటు..ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు డిజిటల్ పరికరాలను వినియోగించడం పరిపాటిగా మారింది. మొదట్లో రెండు లేదా మూడు గంటలే […]
సారథిన్యూస్, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకుడు సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు నెలలుగా జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం జర్నలిస్టులను ఆదుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్ విన్నవించిన […]
సారథిన్యూస్, వికారాబాద్: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా కొండంగల్- తాండూరు రహదారిపై వంతెన తెగిపోయింది. కాగ్నా నదిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని పంటపొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి.
సారథిన్యూస్, కొత్తగూడెం: పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితో శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా పోలీసు అధికారులు శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఈ వీడియో […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం చేసిన పరీక్షలో ఆయనకు నెగెటివ్ వచ్చింది. మంత్రితోపాటు ఆయన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం మంత్రికి కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ‘మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’ అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.