జెనీవా: కరోనాతో యువతకు ముప్పు ఉందని, దాన్ని లైట్ తీసుకోవద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) వార్నింగ్ ఇచ్చింది. వైరస్‌ను లైట్ తీసుకుని సమ్మర్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేయలనుకోవడం వల్లే కేసులు పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నామని అన్నారు. వృద్ధులకు ముప్పు ఉన్నట్లే యువతకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కరోనా బారినపడి యువకులు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రెయేన్ […]
జైపూర్, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జైపూర్ రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని హోటల్‌కు తరలిస్తున్నారని సమాచారం. ఆగస్టు 14న బలపరీక్ష నిర్వహించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం సిద్ధం అవుతోంది. తనకు సపోర్ట్‌గా ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌లోని రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. బీజేపీ తమ పార్టీలోని […]
న్యూఢిల్లీ: చైనా మరో షాక్ తగిలింది. ఇప్పటికే యాప్స్‌ను బ్యాన్ చేసిన ఇండియా కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించింది. టీవీలు దిగుమతి చేసుకునే వారు కచ్చితంగా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని, లైసెన్స్ ఉన్న వాళ్లు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలని సూచించింది. దాన్ని రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తీసుకొచ్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘టీవీ ఇంపోర్ట్స్ ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి వస్తుంది. దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. చైనా టీవీలకు చెక్ […]
సారథి న్యూస్, కర్నూలు: మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదముద్ర వేయడం సంతోషకరమని, సీమ ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేరిందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ సీఆర్‌డీఏ 2014 బిల్లును రద్దుచేస్తూ.. మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడంతో కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఎమ్మెల్యేు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస పాస్‌మార్కులు (35 శాతం) వేసి కంపార్ట్మెంటల్లో పాస్చేసింది. విద్యార్థులందరినీ పాస్చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,941 మంది విద్యార్థులను పాస్చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ప్రకటించారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2 […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు, మహబూబ్నగర్ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరుల బృందం పరిశీలించింది. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతగా ఉండాలని సూచించింది. బృందంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, అంజయ్య […]
సారథి న్యూస్, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుందని, అందువల్ల ఇక్కడ కొత్త ఆస్పత్రిని కట్టాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు ఆయన ఖమ్మం వచ్చిన ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం ఇచ్చారు. 1970లో ఈ ఆస్పత్రిని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి హయాంలో కట్టారని వివరించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సారథి న్యూస్, రామగుండం: పారిశుద్ధ్యం విషయంలో రామగుండం మున్సిపాలిటీ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు శనిగల శ్రీనివాస్, శనిగరపు చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరోనాతోపాటు ఇతర వ్యాధుల ముంపు పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం టెస్టులు చేయకపోవడంతో పేదలు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చేపడతామని పేర్కొన్నారు.