టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఇకపై తాను ముద్దు సన్నివేశాలు, శృంగార భరిత సన్నివేశాల్లో నటించబోనంటూ తేల్చి చెప్పిందట. తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇకపై తను చేసే సినిమాలలో ఇంటిమేట్ సీన్స్ చేయనని తెలిపింది. కరోనా నేపథ్యంలో లిప్‌లాక్స్, హగ్స్, శృంగారభరిత సన్నివేశాలలో నటించాలంటే భయంగా ఉందని చెప్పింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానన్నది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చి మళ్లీ మంచి రోజులు వస్తే అలాంటి సీన్లు చేయడానికి అంగీకరిస్తానని రెజీనా తెలిపింది. […]
అమెరికా అధ్యక్షుడు అప్పుడే చేతులెత్తేశాడా..? అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి పరాజయం పాలు కావడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చాడా..? అయితే, ఇండో–అమెరికన్లు ఈ సారి ట్రంప్ వెనుకే నడవాలనుకుంటున్నారా..? ఈ నిర్ణయమే ట్రంప్‌లో మళ్లీ విజయంపై ఆశలు రేపుతోందా…? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు ఏం జరగబోతోంది..?. ఇవీ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే, ఇటీవల పరిణామాలను చూస్తే ఈ ప్రశ్నలకు నిజమేనన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు […]
న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు విండీస్ క్రికెట్ జట్టు కూడా సమాయత్తమైంది. ఈ మేరకు ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి దిగనుంది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్‌పై దీనిని ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా ఈ లోగోను రూపొందించింది. ఇప్పటికే ప్రీమియర్ లీగ్‌కు చెందిన 20 ఫుట్‌బాల్ క్లబ్స్ ఈ లోగోను ధరించి జాతి […]
టోక్యో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ను నిర్వహించవద్దని సగానిపైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రీడల పండుగను పూర్తిగా రద్దుచేయాలని అభిప్రాయపడుతున్నారు. జపాన్‌కు చెందిన కైడో న్యూస్, టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే వార్త సంస్థలు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఈనెల 26 నుంచి 28 వరకు టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో మొత్తం 1,030 మంది పాల్గొన్నారు. ఇందులో 51.7 శాతం మంది ప్రజలు క్రీడలను వాయిదా […]
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతను చోటు దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ కోసం ఐసీసీ ప్రకటించిన జాబితాలో నిగెల్ లాంగ్ (ఇంగ్లండ్) స్థానంలో నితిన్‌కు చోటు కల్పించారు. 3 టెస్టు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ నిర్వహించిన 36 ఏళ్ల నితిన్.. ఇండియా తరఫున ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి. గతంలో […]
న్యూఢిల్లీ: కరోనా మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. ఢిల్లీ క్లబ్ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ (53).. వైరస్ బారినపడి మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దోబల్ పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్ ఢిల్లీ అండర్–23 టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్లబ్ క్రికెట్లో ప్రముఖ క్రికెటర్‌గా ఉన్న దోబల్.. ఢిల్లీ అండర్–23 టీమ్‌కు సహాయక సిబ్బందిగా కూడా పనిచేశాడు. దీర్ఘకాల వ్యాధులకు […]
లండన్: ఈ ఏడాది ఆరంభంలోనే తనకు కరోనా సోకినా.. దాని గురించి పెద్దగా తెలియకపోవడంతో తీవ్రమైన ఫ్లూగా అర్థం చేసుకున్నానని ఇంగ్లండ్ మాజీ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ వెల్లడించాడు. ‘డిసెంబర్ చివర, జనవరి మొదట్లో నాకు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే దీనికి గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో ఫ్లూ చాలా తీవ్రంగా వచ్చిందని తప్పుగా అర్థం చేసుకున్నా. దీని గురించి పెద్దగా తెలియపోవడంతో చాలా రోజుల బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. […]
న్యూఢిల్లీ: ప్రపంచకప్ 2007 టీ20 జట్టుకు దూరంగా ఉండేలా సచిన్, గంగూలీని.. నాటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఒప్పించాడని అప్పట్లో టీమ్ మేనేజర్‌గా ఉన్న లాల్‌చంద్ రాజ్‌పుత్ తెలిపాడు. యువకులకు అవకాశం ఇవ్వడం కోసమే అలా చేశాడన్నాడు. దీనికి సచిన్, గంగూలీ పెద్ద మనసులో అంగీకరించారన్నాడు. ‘అప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. కొంత మంది ఆటగాళ్లు అక్కడి నుంచి నేరుగా జొహనెస్‌బర్గ్ వెళ్లారు. యువ క్రికెటర్లకు అవకాశం కోసం సీనియర్లు తప్పుకోవాలని అనుకున్నారు. దీనికి […]