ఒకరి మృతి.. పలువురికి అస్వస్థత సంఘటనస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ సారథి న్యూస్, కర్నూలు: విశాఖపట్నం ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనను మరవక ముందే కర్నూలు జిల్లా నంద్యాలలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం నంద్యాలలోని ఏస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్లీక్అవడంతో ఒకరు మృత్యువాతపడ్డారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ పైప్ లీకై బ్లాస్ట్ కావడంతో ఫ్యాక్టరీ మేనేజర్ […]
సారథి న్యూస్, కర్నూలు: క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, భవిష్యత్‌లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీయేనని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఉద్ఘాటించారు. శనివారం సాయంత్రం నగరంలోని లక్ష్మిహోటల్ పక్కన పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసును ఎంపీ టీజీ వెంకటేష్‌తో పాటు సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, రాష్ట్రంలోనూ […]
మాడ్రిడ్: కరోనా విజృంభణ ముందు టోర్నీలు వాయిదా పడుతూనే ఉన్నాయి. తాజాగా టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకమైన డేవిస్ కప్, ఫెడ్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదావేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నవంబర్‌లో మాడ్రిడ్ వేదికగా డేవిస్ కప్ ఫైనల్స్ జరగాల్సి ఉన్నాయి. కానీ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో వచ్చే ఏడాది నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పటికే అర్హత పొందిన 18 జట్లు ఇందులో బరిలోకి దిగుతాయి. మరోవైపు బుడాపెస్ట్‌లో నిర్వహించాల్సిన ఫెడ్ కప్‌ను ఏప్రిల్ 2021కు వాయిదా […]
కరోనా లాక్ డౌన్ కారణంగా పెద్ద పెద్ద చిత్రాల షుటింగ్లు చాలా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ విషయంలో హీరో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.. హీరోయిన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది అన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా ఫిల్మ్ మేకర్ రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి హీరోయిన్ ఆలియా భట్ తప్పుకుందన్న వార్త గాలికంటే వేగంగా చక్కర్లు కొడుతోంది. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదనీ షూటింగ్ మొదలైన వెంటనే వచ్చి […]
ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థతి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు కొనసాగడమే కష్టతరంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వాలు పలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పై తరగతులకు ప్రయోట్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకొనే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్లైన్ క్లాసులు వినాలంటే ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్, లేదా స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఉన్నత వర్గాలు, […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా ఆంక్షలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. డీజిల్ ధరలు అమాంతం పెరుగడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నది.దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న డీజిల్ ధరలు..సంస్థకు మోయలేని భారంగా మారాయి. ఓ వైపు ఆక్యుపెన్సీ లేక.. మరోవైపు పెట్రో భారం కలిసి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది తెలంగాణ ఆర్టీసీ. కరోనా నిబంధనల వల్ల తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికుల్ని అనుమతిస్తున్నారు. వైరస్ భయంతో ప్రజలు ఆ సగం […]
సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి సోకుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలోనే 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. చాలామంది మృత్యువాత పడ్డారు. మార్చి నెలలో హైదరాబాద్ నగరంలో 74 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అప్పటి నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో 527, మేలో 1,015 నమోదు కాగా, జూన్‌లో మరింతగా విజృంభించాయి. జూన్ నెలలో ఇప్పటి […]