Breaking News

Day: June 29, 2020

చెరువులు కబ్జా చేస్తే కేసులు

సారథిన్యూస్​, బిజినేపల్లి: చెరువులు, కుంటలను కబ్జా చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​ అంజిరెడ్డి హెచ్చరించారు. రెండ్రోజుల నుంచి బిజినేపల్లి సమీపంలోని సాఖ చెరువులో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో ఆయన చెరువును పరిశీలించారు. అక్రమంగా మట్టిని తవ్వి చెరువులు పూడ్చిన వారి వివరాలను సేకరించారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ అధికారులు రమేశ్​, ఆర్​ఐ అలీబాబా నాయుడు తదితరులు ఉన్నారు.

Read More

అభివృద్ధికి చిరునామా తెలంగాణ

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి చిరునామా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం MLA సుంకే రవిశంకర్ శంకుస్థపాన చేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ జీవన్, ఎంపీపీ కవిత నాయకులు జితేందర్ రెడ్డి, కర్ణాకర్, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

సైకాలజిస్ట్​ అసోసియేషన్​ ఎన్నిక

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రామడుగు మండలం గోపాల్​రావుపేటకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎజ్రా మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా రేష్మ, ప్రధాన కార్యదర్శిగా ఐలయ్య, సంయుక్త కార్యదర్శిగా అశోక్, సభ్యులుగా సదానందం, కుమార స్వామి తదితరులు ఎన్నికయ్యారు.

Read More

పనులు ప్రారంభించేదెప్పుడు?

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యపనులను వెంటనే మొదలు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. నిధులు విడుదలైనప్పటికీ డంపింగ్​యార్డు, శ్మశానవాటిక పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు వారు సోమవారం రామడుగు డివిజినల్​ పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు పురేళ్ల శ్రీకాంత్​, అనుపురం పరుశరాం, ఉపసర్పంచ్​ రాజేందర్​ తదితరులు ఉన్నారు.

Read More

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: పెట్రోల్​, డిజిల్​ ధరలను వెంటనే డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి డిమాండ్​ చేశారు. సోమవారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. కరోనాతో ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్​, డిజిల్​ ధరలు పెంచడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే పెట్రో ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, మాజీ మార్కెట్ […]

Read More

మట్టి తరలింపును అడ్డుకోండి

సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యుడు గడిపె మల్లేశ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, […]

Read More

మొక్కలే జీవకోటికి ప్రాణాధారం

సారథి న్యూస్, హుస్నాబాద్/ బిజినేపల్లి: మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన చెట్లను పరిరక్షించాలని కోరారు. కాగా కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ పట్టణంలోని 5,7,17 వ వార్డుల్లో మున్సిపల్​ చైర్​పర్యన్​ ఆకుల రజిత మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో హుస్నాబాద్​ వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు […]

Read More

‘ఉపాధి’ పనిదినాలు పెంచండి

సారథి న్యూస్, రామాయంపేట: జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలని దళిత బహుజలన ఫ్రంట్​ జాతీయ కార్యదర్శి పీ శంకర్​ డిమాండ్​ చేశారు. సోమవారం నిజాంపేట మండలం చల్మెడలో జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ తో నిరుద్యోగం పెరిగి లక్షలమంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్​ దుబాషి సంజివ్ బుచ్చయ్య, మల్లేశం, పరుశరాములు, స్వామి, […]

Read More