ప్రశ్నిస్తున్న బాలకేంద్రాల్లోని పార్ట్ టైం, కాంట్రాక్టు ఉద్యోగులు 20 ఏళ్ల సీనియారిటీ.. రూ.3వేలు, రూ.4వేల జీతాలే పిల్లల ఆటాపాటలు, బహుమతులకు డబ్బులు కరువు ‘తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమేనని.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. డబ్బులకు కొదవలేదు..’ 6వ విడత హరితహారం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట ఇది.. ‘మేం ప్రతి జాతీయ పండగను ఘనంగా జరుపుకుంటాం. పిల్లల చేత నాటికలు, నాటకాలు, ఏక పాత్రాభినయాలూ చేయిస్తాం. మహనీయుల పుట్టిన రోజులు, ప్రముఖుల వర్ధంతుల సందర్భంగా […]
ప్రపంచంలో అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్‌సిటీని అద్దెకు ఇచ్చేశారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌తో సినిమా ఇండస్ట్రీ దారుణమైన నష్టాలను చవిచూసింది. పెద్ద, చిన్న తేడాలు లేకుండా సినిమాలు అన్నీ అటెకెక్కాయి. చివరకు టీవీ సీరియళ్ల చిత్రీకరణలు కూడా నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే టీవీల షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఫిల్మ్ సిటీలో అన్ని కార్యకలాపాలు నిలిపివేశారు. పనులు లేకపోవడంతో సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకూ […]
ప్రముఖ రచయిత మధుబాబు రచించిన షాడో నవల తెలుగు పాఠకులను ఎంతో ఆకట్టుకున్నది. ఈ నవలా ఆధారంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇప్పడో వెబ్‌సీరిస్‌ను తెరకెక్కిస్తున్నది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ‘రాజా చేయ్యవేస్తే’ సినిమా దర్శకుడు ప్రదీప్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానున్నది.
సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు అంతా హైదరాబాద్ నగరంలోని పార్క్ హయత్ హోటల్ చుట్టూ తిరుగుతోంది. ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనను పదవినుంచి తొలగించింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ఎన్నికల అధికారిని కూడా నియమించింది. అయితే, రమేష్‌కుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయనను విధుల్లో తిరిగి నియమించాలని కూడా […]
కొలంబో: కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. సినిమా థియేటర్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో అన్ని దేశాలు క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి. అయినప్పటికీ చాలా దేశాల్లో సినిమాహాళ్లు, పబ్లిక్ పార్కులు, పబ్‌లు వంటివి తెరవలేదు. కాగా తాజాగా శ్రీలంకలో సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేయనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఇందుకు ప్రతి థియేటర్ నిర్వాహకులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.అలాగే దేశంలో అన్ని మ్యూజియాలను, […]
అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ మరోసారి మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయాలంటూ ఫైర్ అయ్యారు. ఇంతకు ఈ భామకు కొపం తెప్పించిన ఈ వార్త ఎంటో తెలుసా.. రకుల్ శివకార్తికేయన్ సరసన తమిళంలో ‘అయలాన్’ అనే సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల ప్రభుత్వాలు షూటింగ్ కు అనుమతి ఇవ్వడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు చిత్ర నిర్మాత. కానీ కరోనా తగ్గే వరకు తాను షూటింగ్లో పాల్గొనని […]
సినిమా తారలు, క్రీడాకారుల వ్యక్తిగత సంబంధాలపై పుకార్లు రావడం కొత్త కాదు. కొందరు ఆకతాయిలు సోషల్‌మీడియా వేదికగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇష్టమొచ్చినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా నటి తమన్నా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఓ నగల షాప్‌లో రజాక్‌తో కలిసి తమన్నా నగలు కొనుగోలు చేస్తున్నదంటూ ఓ ఫొటోను కూడా సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. దీంతో విసుగు చెందిన మిల్కీబ్యూటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. […]