సారథి న్యూస్, హైదరాబాద్: సివిల్ వివాదంలో తలదూర్చి తనను భదాద్రి-కొత్తగూడెం ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. పాల్వంచ ఎస్సైతో కలిసి తన ఐదెకరాల పొలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి పిలిపించి ఎస్పీ బెదిరించారని ఆరోపించారు.ఈ పిటిషన్‌పై హెచ్‌ఆర్సీ తీవ్రంగా స్పందించింది. సివిల్ వివాదంలో ఈ ఘటనపై ఒక ఆర్డీవో ర్యాంకు స్థాయి అధికారితో విచారణ జరిపించాలని భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సమగ్ర నివేదికను జూలై […]
సారథి న్యూస్, షాద్‌నగర్: ఈనెల 19న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నప్ నకు గురై కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉన్న రామచంద్రారెడ్డి హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భూవివాదమే ప్రాణం తీసినట్లు పోలీసులు తేల్చారు. సోమవారం వివరాలను షాద్ నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డికి కొంతకాలంగా […]
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి తీసి, వర్మి కంపోస్టు ఎరువును వాడుతూ నాటాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా వైరస్ ను అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ హుస్నాబాద్ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. సోమవారం అక్కన్నపేట హెల్త్‌సెంటర్ ఎదుట ఆందోళన చేపట్టారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, పోలీసులు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నవారికి కోవిడ్-19 టెస్టులు చేయాలన్నారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. బిజెపి నాయకులు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కళ్యాణ్, సాయిరాం పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామయంపేట: గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మెదక్‌జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో బాలవికాస, ప్రాంక్లిన్ టెంపుల్ టెన్ సంస్థల సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. సర్పంచ్ నరసింహరెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ బాల్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,005 మంది కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 107 […]
సారథిన్యూస్, కొత్తగూడెం: సింగరేణిలో ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెంలో కాంట్రాక్ట్ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలోనే ప్రత్యామ్నాయ పనులలో వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీ ప్రమోద్, ఎన్ సూర్య, భద్రం, నిజాముద్దీన్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, సమ్మయ్య, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేటలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కల్యాణ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.