Breaking News

Day: June 19, 2020

పేదల సంక్షేమమే ధ్యేయం

సారథిన్యూస్​, హైదరాబాద్ : పేద ప్రజలు అన్ని వసతులతో సొంత ఇంట్లో సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్​ ఉద్దేశ్యమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని బజ్జు గుట్టలో రూ. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్​బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలపై శుక్రవారం సమీక్షించారు. ఒక్కో డబుల్​ బెడ్​రూం ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.75 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్​ బొంతు రామ్మోహన్​, వివిధ శాఖల […]

Read More

నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్​ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]

Read More

సంతోష్ బాబు ఇంటికి నేనే వెళ్తా

సారథిన్యూస్​, హైదరాబాద్​: కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, సంతోష్​ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానీ మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా […]

Read More

పార్కులతో ఆహ్లాదం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్​ గ్రామంలోని వివేకానంద యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కుకు శుక్రవారం సర్పంచ్ బాల్ నర్సవ్వ, ఎంపీపీ సిద్ధరాములు శంకుస్థాపన చేశారు. పార్కు లోపల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Read More

ఘనంగా రాహుల్​ జన్మదినం

సారథిన్యూస్, బిజినేపల్లి: రాహుల్​గాంధీ కుటుంబానికి తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉన్నదని ఎంపీటీసీ అంజి యాదవ్​ పేర్కొన్నారు. శుక్రవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో రాహుల్​ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి పలువురు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, ఉష అన్న , పాష , ఈశ్వర్, సూరి తదితరులు పాల్గొన్నారు.

Read More

పారిశుద్ధ్యానికే ప్రాధాన్యం

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్రప్రభుత్వం పారిశుద్ధ్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నదని రామాయంపేట డిప్యూటీ కమిషనర్​ రవీందర్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో డంపింగ్​ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన మెదక్ డీపీవో హనోక్ తో కలసి నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి దగ్గరే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ రెడ్డి, ఎంపీపీ […]

Read More

దళితులు ఆత్మగౌరవంతో జీవించాలి

సారథి న్యూస్, రామాయంపేట: కూలీలుగా ఉన్న దళితులు రైతులుగా ఎదగాలని, ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బహుజన రిసోర్స్​ సెంటర్ ​(డీబీఆర్సీ) రాష్ట్ర సమన్వయ కర్త పీ శంకర్​ పేర్కొన్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో దళిత మహిళా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన మూడెకరాలు తీసుకున్న దళితులు ఆహార పంటలను పండించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీబీఅర్సీ మెదక్‌ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజీవ్, పరశురాములు, దేవరాజు, స్వామి, […]

Read More

కాంట్రాక్ట్​ కార్మికులపై వివక్ష తగదు

సారథి న్యూస్​, కొత్తగూడెం: సింగరేణిలోని కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్ట్​ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని శుక్రవారం హౌస్ కీపింగ్ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం సింగరేణి జనరల్ మేనేజర్ (సెంట్రల్ వర్క్ షాప్) గణపతిరావుకు వినతి పత్రం అందజేశారు. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కొంతమంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా విధులనుంచి పంపించి వేస్తున్నారని కార్మికసంఘం నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యర్రగాని కృష్ణయ్య, సూర్య, సరోజ, రమా, రహీమ్, ప్రేమ్ […]

Read More