Breaking News

Day: June 19, 2020

పెంచిన జీతాల కోసం పోరు

సారథి న్యూస్, రామాయంపేట: పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. నిజాంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వారు ధర్నా చేపట్టారు. జీవో 51ని అడ్డంపెట్టుకొని కార్మికులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నేత నింగోళ్ల సత్యం, కార్మికులు పాల్గొన్నారు.

Read More

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

సారథిన్యూస్,రామడుగు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్​ నేతలు శుక్రవారం 100 మంది నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్​ యూత్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పంజల శ్రీనివాస్, గోపాల్​రావుపేట సర్పంచ్ సత్య ప్రసన్న, కాంగ్రెస్​ నాయకులు దేవకిషన్, శంకర్, బాలగౌడ్, పిండి […]

Read More

కలెక్టరేట్​ పనులు వేగవంతం

సారథిన్యూస్​, మహబూబాబాద్: కలెక్టరేట్​ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మహబూబాబాద్​ కలెక్టర్​ వీపీ గౌతం ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలోని కురవిలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలో పర్యటించారు. వాహనాలు రోడ్లపై నిలుపకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపికచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కొత్తగా ఐదు గోదాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ […]

Read More

అమర జవానులకు ఘననివాళి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : తిమ్మాజిపేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు, ఇతర వీర జవాన్లకు ఘన నివాళలర్పించారు.స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాగడల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లను ఈ దేశం […]

Read More

నకిలీ సీడ్స్ అమ్మితే చెప్పండి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ అన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విత్తన విక్రయదారులు, వ్యవసాయ అధికారులతో శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయిశేఖర్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్, రెండవ సారి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి లేని నకిలీ విత్తనాలను అమ్మితే పీడీ యాక్ట్ చట్టప్రకారం […]

Read More

హైదరాబాద్​లో మరో ఐరన్​ బ్రిడ్జి

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​ నగరంలో కొత్తగా ఓ ఐరన్​ బ్రిడ్జిని పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రుల తలసాని శ్రీనివాస్​యాదవ్​, మహమూద్​ అలీ ఐరన్​ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్​ బొంతు రామ్మోహన్​, ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, కార్పొరేటర్​ కవితారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Read More

ఉద్యమంలా గ్రీన్​ ఛాలెంజ్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ ప్రారంభించిన ‘గ్రీన్​ ఇండియా చాలెంజ్’​ ఉద్యమంలా కొనసాగుతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఆయన గ్రీన్​ చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి ఆలయ ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్​, మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు. […]

Read More
షార్ట్ న్యూస్

నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్​ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]

Read More