బాలీవుడ్లో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చాలా సంచలనాన్నే క్రియేట్ చేసింది. సినీవర్గాల్లో తీవ్ర చర్చాంశనీయాంశం కూడా అయింది. ఎంతో ప్రతిభ ఉన్నా సుశాంత్‌కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆ కారణంగా సుశాంత్ డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొందరు బాలీవుడ్ ప్రముఖుల వల్లే సుశాంత్‌కు ఈ స్థితి వచ్చిందని దుయ్యబడుతున్నారు. అయితే ఆ ప్రముఖుల్లో కరణ్ జోహార్ ఒకరు. సుశాంత్ విషయంలో ప్రస్తుతం కరణ్ […]
జూలై 10, 2015లో మొదలైన బాహుబలి హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కించిన బాహుబలి 1,2లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించి తెలుగు ఇండస్ట్రీ సత్తా నిరూపించాయి. అయితే ఈ సినిమా గతనెల మే 31న రష్యాలో టివీ ఛానెల్లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ‘బాహుబలి’కి మామూలు స్పందన రాలేదు. అంతగా ఎవరినీ మెచ్చని రష్యన్స్ కూడా బాహుబలిని ఆకాశానికి ఎత్తేశారు. ఒక్కసారిగా ప్రభాస్ […]
సారథి న్యూస్, రామడుగు/ఖమ్మం: చైనా శత్రు మూకల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు రామడుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యావంతులవేదిక ఆధ్వర్యంలో గురువారం కొవ్వత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళి అర్పించారు.
సౌత్‌లో అగ్ర హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషతో కలిపి దాదాపు 260కి పైగా చిత్రాల్లో నటించింది. ‘బాహుబలి’లో శివగామిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సీరియళ్లు, వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలతోనూ బిజీగా గడుపుతున్న రమ్య.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు తన ప్రాజెక్టుల వివరాలు చెప్పింది. ప్రజంట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటిస్తున్న చిత్రంలో కీలక […]
సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గును విక్రయించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేకపోర్టల్ను ప్రారంభించింది. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించినట్టు సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్) భాస్కర్‌రావు, ఆపరేషన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోర్టల్ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com వెబ్‌సైట్‌ను కానీ 040-23142219 నంబర్ లో కానీ సంప్రదించాలని కోరారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల […]
సారథిన్యూస్ ములుగు: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న 25 మంది వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించారు. శాంపిళ్లను పరీక్షల కోసం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ ల్యాబ్ కు పంపామని చెప్పారు.
సారథి న్యూస్, మెదక్: ఉపాధి హామీ పథకంపై జిల్లా అధికారులు ప్రత్యేకశ్రద్ధ చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో నీటి పారుదల, జిల్లా గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఎన్ని చెరువులు, ఫీడర్ చానెళ్లు, తూములు, వాటర్ ట్యాంకులు ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో […]