ప్రజంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు.. మల్టీ స్టారర్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంతకు ముందు లేని విధంగా భారీ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 20వ పాన్ ఇండియన్ మూవీ.. ఇంకా అల్లు అర్జున్ ‘పుష్ప’ ఇలా అన్నీ పెద్ద సినిమా రేంజ్‌ల సిద్ధమవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. డైలాగ్ […]
భారత్- చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరియు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు
సారథిన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ, అతడి కుటుంబసభ్యులు నలుగురికి కరోనా సోకింది. కాగా కొంతకాలంగా వీఆర్ఏకు కరోనా లక్షణాలు కనిపించడంతో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా.. వీఆర్వోకు అతడి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
సారథి న్యూస్, గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామంలో నిర్మించనున్న పద్మశాలి సంఘ భవనం, మహిళా సంఘం, ఎస్సీ కమ్యూనిటీహాల్ పనులకు బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధాని మోదీ పాలన జనరంజకంగా సాగుతున్నదనికరీంనగర్ జిల్లా బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రామవరం, గండిపల్లి గ్రామాల్లో బీజేపీ ఏడాది పాలనపై నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలోని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేతివృత్తులపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి చేయూతనిస్తున్న ప్రజా నాయకుడు మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాగర్, మనోహర్, అజయ్, కృష్ణ, మహేష్, నాగేష్, భిక్షపతి తదితరులు […]
సారథిన్యూస్, బిజినేపల్లి: లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్త సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని నూతన కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమైందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి , సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిరణ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి , […]
సారథిన్యూస్, తలకొండపల్లి: ఆలయభూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నెంబరు 75 లోని ఉన్న ఆలయభూమిలో కొందరు రహదారిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్. దేవాదాయశాఖ అధికారులు తగిన చొరవ తీసుకోవాలని, ఆలయ భూములు పరిరక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, రామడుగు: చైనా కవ్వింపు చర్యలకు బలైపోయిన 20 మంది అమర జవానులకు రామడుగు పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా రామడుగు స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సరిహద్దులో శత్రుమూకలతో పోరాడి ప్రాణాలు అర్పించిన జవానుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. వారు కలలుగన్న లక్ష్యసాధనకు మనమంత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది, యువకులు […]