సారథి న్యూస్ హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొండాపూర్, సరూర్‌నగర్, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిసరాల్లో 50వేల కరోనాటెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యసిబ్బంది పరీక్షలు చేస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవిమేకర్స్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం పరిమితమైన సిబ్బందితో పాటలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నది. లాక్‌డౌన్‌తో రెండో షెడ్యూల్ ఆగిపోయింది. ఇప్పుడు అనుమతి రావడంతో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ […]
సారథి న్యూస్, రామాయంపేట: పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.5000 వేల ఇన్సెంటివ్, పెరిగిన రూ. 8500 జీతం వెంటనే ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలంలోని పలుగ్రామాల పారిశుద్ధ్య కార్మికులు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల దగ్గర ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు నింగోళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల విడుదలకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రశ్నపత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది. స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కాగా, గతేడాది తలెత్తిన సమస్యలు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన ప్రక్రియను మరోసారి పునః పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి కానుంది. మొత్తానికి ఈనెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
ఇప్పటికే 85శాతం మేర పూర్తి మెట్టప్రాంతానికి గోదావరి జలాలు 1.06లక్షల ఎకరాలకు సాగునీరు సారథి న్యూస్, హుస్నాబాద్: మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ వనులు తుదిదశకు చేరాయి. త్వరితగతిన వనులు పూర్తిచేసి దసరాలోగా రిజర్వాయర్ లోకి గోదావరి జలాలను విడుదల చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 90వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలకు మొత్తంగా 1.06 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తారు. […]
సారథి న్యూస్, రామాయంపేట: కరోనా విధుల్లో ఫస్ట్ వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.ఐదువేల ఇన్సెంటివ్ ప్రకటించగా, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇన్సెంటివ్‌తో పాట పెరిగిన రూ.8,500 జీతం ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. సోమవారం రాత్రి మెదక్ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆయా పంచాయతీ ఆఫీసుల వద్ద ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవోనం.51 పేరుతో […]
సారథి న్యూస్, రామాయంపేట: పాము చిన్నదైనా పెద్దకర్రతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. 8 అడుగుల పామును చూస్తే ఎవరైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండగా సుమారు 8అడుగుల జెర్రిపోతు పాము కనిపించింది. మొదట్లో దాన్ని చూసి భయపడిన తర్వాత చుట్టుపక్కల రైతుల సహాయంతో కొట్టి చంపారు. పాము చనిపోయిన తర్వాత దానితో కొందరు ఫొటోలు దిగారు.
న్యూఢిల్లీ: భారత స్టార్ స్ర్పింటర్ హిమాదాస్.. ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు రేస్‌లో నిలిచింది. ఈ పురస్కారం కోసం ఆమె పేరును అసోం ప్రభుత్వం సిఫారసు చేసింది. 2018లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్ షిప్‌తో పాటు మహిళల 400 మీటర్లలో స్వర్ణం గెలిచిన హిమా.. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో తొలి పసిడి గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, 400 మీటర్ల వ్యక్తిగత పరుగులో రజతం నెగ్గింది. గతేడాది ప్రపంచ […]