సారథి న్యూస్, చొప్పదండి: కరోనా నేపథ్యంలో లయన్స్‌క్లబ్ విశేషసేవలందిస్తున్నది. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గకేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు, సిబ్బందికి మాస్కులు పంపిణీచేశారు. కరోనాను రూపుమాపేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తొడుపునూరి లక్ష్మయ్య, ఒల్లల కృష్ణాహరి, వైస్ ప్రెసిడెంట్ కొల్లూరి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, ఆమన్‌గల్: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం ఎంతో గొప్ప కార్యక్రమమనిఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ వెంట ఆమనగల్ ఎంపీపీ అనితా విజయ్, టీఆర్ఎస్ నాయకులు జంగయ్య, బాబా, రవీందర్, శివలింగం, శేఖర్, అల్లాజీ, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, శేఖర్, నరేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు
సారథి న్యూస్, సూర్యాపేట: రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. రైతురాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి దివంగత శానంపూడి అక్కిరెడ్డి స్మారకార్థం నిర్మించనున్న రైతువేదిక నిర్మాణాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ట్రాక్టర్.. రోటవేటర్ కిందపడి ఆరేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. మహాదేవుని పేటకు చెందిన రైతు బక్క చిన్న మాసయ్య పొలంలో రోటవేటర్‌తో దుక్కిదున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వచ్చిన అతడి కుమారుడు ప్రవీణ్‌కుమార్(6) వెనుక నుంచి పరిగెత్తుకుంటే వెళ్లి రోటవేటర్ లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గమనించి ట్రాక్టర్ ఆపగా అప్పటికే ప్రవీణ్ […]
సారథి న్యూస్, హైదారాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కార్ డ్రైవర్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, మేయర్ కుటుంబసభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం మేయర్ కు మెడికల్ టెస్ట్‌లు చేశారు.
సారథి న్యూస్, బిజినేపల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించి కరోనాను దూరం చేసుకోవచ్చని వైద్యాధికారి డాక్టర్ కల్పన సూచించారు. శుక్రవారం ఆమె నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో మాస్కులను పంపిణీ చేశారు. చేతులను తరుచూ సబ్బు లేదా శానిజైటర్తో శుభ్రం చేసుకోవాలని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ గోవిందు సుజాత, మాజిద్, సర్పంచ్ సితార, ఎంపీటీసీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కలెక్టర్ గౌతమ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అటవీ ప్రాంతంలో పర్యటించి సోలార్ బోర్వెల్ పాయింట్స్, ప్లాంటేషన్ పనులకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. బయ్యారం మండల కేంద్రంలో పలు చోట్ల నీటినిల్వలు ఉండటం పట్ల పారిశుద్ధ కార్మికులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
– ఫలితాల కోసం https://bie.ap.gov.in సంప్రదించవచ్చు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు రిజల్ట్స్‌ను రిలీజ్ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘అన్ని సవాళ్లను అధిగమించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ప్రప్రథమంగా ఫలితాలను మనం విడుదల చేశాం. […]