కండలవీరుడిగా ప్రశంసించుకోవడం ఇష్టం ఉండదేమో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ ఒంటిమీద చొక్కా లేకుండా దర్శనం ఇవ్వలేదు. కానీ ఈ లాక్ డౌన్ మహేష్ ను అలా చూసేందుకు వీలు కల్పించింది. తన చిన్నారి సితారతో స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ తీసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింటిలో వైరల్ అవుతోంది. షూటింగ్ వాయిదాల వల్ల ఇంటికే పరిమితమైన మహేష్ తన ఫొటోలతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత పరుశరామ్ […]
డేటింగ్ లు గ్రటా అన్నీ అయిపోయి దాదాపు పెళ్లి చేసుకుంటున్నారు అనుకునే టైమ్ వచ్చేసరికి ఇద్దరూ విడిపోయారు విశాల్ అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. సాలిడ్ పర్సనాలిటీతో స్టామినాగా ఉండే ఈ తమిళ ముద్దుగుమ్మ తర్వాతేమో ఓ క్రికెటర్ తో డ్యూయెట్లు పాడుతోంది, పెళ్లికూడా చేసుకుంటుందట అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ వరలక్ష్మి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది.. ఒకవేళ చేసుకుంటే మీ […]
సారథి న్యూస్, నర్సాపూర్: ఎల్లంకి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, లయన్స్ క్లబ్ నర్సాపూర్ స్నేహబంధ్ సెక్రటరీ అశోక్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నర్సాపూర్ లో ఉపాధి హామీ కూలీలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. వేసవిలో పనులు చేసుకుంటున్న వారికి తమవంతు సాయంగా వాటిని పంపిణీ చేశానని చెప్పారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా మండలం వెదిర సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందేల్లి ప్రభాకర్ రావు(46) భార్యతో కలిసి బైక్ పై కొండగట్టు నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తుండగా, కరీంనగర్ నుంచి ఎదురుగా జగిత్యాల వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రభాకర్‌రావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. మృతుడి […]
సారథి న్యూస్, గోదావరిఖని: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పోలీసులు ఎంతో శ్రమించారని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సన్ రైస్, స్టార్ హాస్పిటల్స్ డైరెక్టర్లు డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిబ్బందికి మంగళవారం వారు మాస్క్‌లు, శానిటైజర్స్ అందజేశారు. కార్యక్రమంలో సీపీ వి.సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్, ఏసీపీ నరేందర్,మంచిర్యాల పట్టణ సీఐ ముత్తి లింగయ్య, సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ బుద్దె స్వామి, మంచిర్యాల పట్టణ ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ నిజాంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతిచెందారు. మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రంగ పోచయ్య(63) రెండు రోజుల క్రితం మామిడి పండ్లు తెంచే క్రమంలో చెట్టు పైనుంచి కాలుజారి కింద పడి.. చికిత్స పొందుతూ చనిపోయాడు. చల్మేడ గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు(36) గత బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సపొందుతూ పరిస్థితి […]
సారథి న్యూస్, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీచేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి అక్కడి లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మెండేం లలిత, టీఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ […]
ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సారథి న్యూస్, పెద్దపల్లి: గోదావరి నీటి విషయంలో కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హెచ్చరించారు. రెండు జిల్లాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మిగతా నీటిని బయటకు తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల గురించి సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీటిని కరీంనగర్, పెద్దపల్లి […]