భక్తుల కొంగు బంగారంగా సహకార ఆంజనేయ స్వామి పర్యాటకంగా అభివృద్ధిచెందుతున్న ఆలయం సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా గొట్టిముక్కుల పంచాయతీ చాకలిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. దట్టమైన అరణ్యంలో కొలువైన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. తూప్రాన్– నర్సాపూర్ మెయిన్ రోడ్డుకు ఆనుకుని అరణ్యంలో కొలువైన సహకార ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తజనం వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతుండడంతో స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఉమ్మడి మెదక్ […]
బెంగళూరు: కరోనా కారణంగా మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. శుక్రవారం ఫ్రాంక్ఫర్ట్ నుంచి బయలుదేరిన విషీ శనివారం బెంగళూరుకు వచ్చాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకున్న తర్వాత ఆనంద్ చెన్నైకి వస్తారని అతని భార్య అరుణ తెలిపారు. బుండెస్లిగా టోర్నీ కోసం ఫిబ్రవరిలో ఆనంద్ జర్మనీకి వెళ్లాడు. మార్చిలో స్వదేశానికి రావాల్సి ఉన్నా కరోనా లాక్ డౌన్, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించడంతో అక్కడే ఉండిపోయాడు. […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్‌లో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్ ఆడేందుకు టీమిండియా అంత సుముఖంగా లేదని సమాచారం. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో కేవలం మూడు మ్యాచ్‌ల కోసం ఆసీస్‌కు వెళ్లి […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ.. కరోనా వైరస్ కట్టడి చర్యలపై గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) భూములను రీసర్వే చేయించి భూ కబ్జాదారులు నుంచి కాపాడాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. వేలమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ.. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఓయూ భూములను కాపాడాలని వారు కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శనివారం అరణ్య భవన్ లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ కుమార్ తో కలిసి సమీక్షించారు. రిజర్వాయర్ పాత కొత్త పనుల కోసం రూ.583.2 77 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.493.91 […]
కంటైన్‌మెంట్ జోన్ల వరకే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. మే 31న లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు చేసింది. దశలవారీగా కొన్ని మినహాయింపులూ వెలువరించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం […]
ఆంధ్రప్రదేశ్ సభాపతి తమ్మినేని సారథి న్యూస్, శ్రీకాకుళం: రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే)రైతులకు బాసటగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గ్రామీణ వ్యవస్థలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని వివరించారు. ఆమదాలవలస మండలం తొగారాం గ్రామంలో శనివారం ఆయన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే వైఎస్సార్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రూ.9.7 కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో సమీకృత ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుభరోసా కింద జిల్లాలో […]