మంత్రి హరీశ్‌రావు సారథి న్యూస్, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే నియంత్రత వ్యవసాయ విధానాన్ని అమలుచేస్తున్నామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. శనివారం ఆయన సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో రైతుబంధు కింద ఇచ్చేందుకు ఇప్పటికే రూ.ఏడువేల కోట్లలో రూ.3500 కోట్ల ను వ్యవసాయశాఖ ఖాతాలోకి జమచేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 20వేల మందికిపైగా రైతులకు ఓకే విడత రుణమాఫీ చేశామన్నారు. […]
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. శనివారం ఆయన రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్ చైర్మన్లతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పల్లెప్రగతి పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, పంచాయతీరాజ్ సెక్రటరీలు రఘునందన్ రావు, సందీప్ సుల్తానియా, రంగారెడ్డి కలెక్టర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.
జూన్ 1వ తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో రాజధాని నగరంలో నిలిచిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ తర్వాత నుంచి మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించగా, […]
ఒకప్పుడు ఆడవాళ్లు ఎక్కువగా మాట్లాడుకునేది వెంకీ అని.. ముద్దుగా పిలుచుకునే విక్టరీ వెంకటేష్ సినిమాల గురించే. ట్రెండ్ మారుతున్నా వెంకటేష్ హవా తగ్గలేదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యడమూ మానలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్ అని తెలిసిందే. కానీ ట్రెండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండే […]
– నేడు రైళ్ల టికెట్ బుకింగ్ ప్రారంభంసారథి న్యూస్, హైదరాబాద్: మే 17 వరకు ప్రయాణికుల రైళ్లు నడవవని ఇదివరకు చెప్పిన రైల్వేశాఖ తాజాగా నిర్ణయం మార్చుకుంది. మే 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనుంది. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, […]
శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రానైట్ ఫ్లోరింగ్ తో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ తో సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపొందించడం కోసమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు.. నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను నూతన హంగులు సమకూర్చనున్నామని తెలిపారు. నీటి సరఫరా, టాయిలెట్ల […]
చాలామంది కొత్త నటీనటులకు అవకాశం ఇస్తూ.. పెద్దపెద్ద చిత్రాలను నిర్మిస్తూ.. టాలీవుడ్ తిరుగులేని ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఆదివారం రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ అతి తక్కువమంది సమక్షంలోనే ఆయన తేజశ్విని అనే ఆమెను వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో చనిపోయారు. 2017 నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నందున తండ్రికి మళ్లీ […]
‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగు అమ్మా..!!’ అని ఓ సినిమా కవి చెప్పింది అక్షరాలా నిజం. అమ్మ లేనిదే సృష్టి లేదు.. అసలు మనిషికి మనుగడే లేదు. అయినా అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కారణం అమ్మ పంచే ప్రేమకు కొలమానం లేదు. దేవుడికి సైతం దక్కని అమ్మ ప్రేమ మనిషికి మాత్రమే దక్కింది. అందుకే దేవుడికి అవసరమయ్యే అమృతం.. మనిషికి అక్కర్లేదు. అలాంటి అమ్మను […]