Breaking News

Day: April 30, 2020

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

సారథి న్యూస్, పెద్దపల్లి: కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో గురువారం కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More

పేదలకు ఎమ్మార్పీఎస్ సాయం

సారథి న్యూస్, గోధావరిఖని: లాక్​ డౌన్​ సమయంలో గోదావరిఖని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వంద మంది కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) నాయకులు నిత్యావసర సరుకులను గురువారం అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద రవికుమార్ మాదిగ, పల్లె బాబు మాదిగ, జిల్లా నాయకులు కన్నూరి ధర్మేందర్ మాదిగ,  అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్లు మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read More
కరోనా నియంత్రణలో భేష్​

కరోనా నియంత్రణలో భేష్​

​సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనాను సమష్టగా ఎదుర్కొన్నామని మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. గురువారం ఆయన మహబూబ్​ నగర్​ జిల్లా కలెక్టరేట్​ లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో రెండు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే జీరో అవుతాయని చెప్పారు. మహబూబ్​ నగర్​ జిల్లా రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వచ్చిందని, త్వరలో గ్రీన్ జోన్ కు వస్తుందని, ఉపాధిలో 28వేల మందికి పనులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం […]

Read More
పనులు చేయకుంటే తొలగించండి

పనులు చేయకుంటే తొలగించండి

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: జిల్లాలో పెండింగ్​లో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్​ అధికారులు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్​ లిస్ట్​లో పెట్టాలని, వినకపోతే కాంట్రాక్ట్​ షిప్​​ రద్దుచేయాలని సూచించారు. గురువారం ఆయన మహబూబ్ నగర్​ జిల్లా కలెక్టర్​ ఎస్​.వెంకటరావుతో కలిసి కలెక్టరేట్​ లో నేషనల్ హైవే, ఆర్అండ్ బీ, మున్సిపల్, పంచాయతీ రాజ్, హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సమష్టి కృషితో కరోనాను నియంత్రించామని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది, […]

Read More
పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం కరోనా, లాక్​ డౌన్​ నేపథ్యంలో పేదలకు బీజేపీ నాయకులు గురువారం గోదావరిఖనిలోని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగ ర్​లో 250 మంది కూలీలకు అన్నదానం చేశారు. బీజేపీ నాయకులు సోమారపు అరుణ్​ కుమార్​, మాజీ కార్పొరేటర్​, బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాతంగి రేణుక, శంకర్ పాసంరాజు, సంజీవ్ లక్ష్మీనారాయణ, బిలాల్ పాల్గొన్నారు.  

Read More
ఆ మార్గం నుంచి ఇతరులను రానివ్వకండి

ఆ మార్గం నుంచి ఇతరులను రానివ్వకండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్– 19 (కరోనా)కు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులను కలెక్టర్ జె.నివాస్ గురువారం పరిశీలించారు. కరోనా వ్యాధిగ్రస్తులు వచ్చే మార్గం గుండా ఇతర వ్యాధిగ్రస్తులు రాకపోకలు సాగించకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. జీజీహెచ్ లో 90 బెడ్లను ఐసోలేషన్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి కూడా ప్రత్యేక వసతి ఉండాలని, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్​ మెంట్​ సరఫరా చేయాలని […]

Read More
రోహిత్.. హ్యాపీ బర్త్ డే

రోహిత్.. హ్యాపీ బర్త్ డే

ముంబై: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం33వ పడిలోకి అడుగుపెట్టాడు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రోహిత్ సాదాసీదాగా బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. భార్య రితిక, కూతురు సమైరాతో ఆనందంగా గడిపాడు. ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడడంతో ఈసారి ముంబై ఇండియన్స్ సహచరుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయాడు. రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ ప్రపంచం ఘనంగా శుభాకాంక్షలు తెలిపింది. ‘హిట్ మ్యాన్’ కు స్పెషల్ డే అంటూ ట్వీట్ చేసింది. […]

Read More

బావిలో పడి మహిళ మృతి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన వట్టెం ప్రేమలత అనే మహిళ(35) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బావిలో పడిన సమయంలో ఆమెను స్థానికులు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. కాగా, మృతురాలి భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

Read More