Breaking News

Day: April 30, 2020

కరోనాతో ముగ్గురు మృతి

కరోనాతో ముగ్గురు మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్​ బులిటెన్​ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. కరోనాతో ఒకరోజే ముగ్గురు మృతిచెందగా, ఇప్పటి వరకు 28 చనిపోయినట్లు ప్రకటించింది. తాజాగా 33 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్​ అయ్యారని, ఇప్పటి వరకు 442 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1038 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

Read More
‘గోపల్ దిన్నె’ లింక్ కెనాల్ కు రూ.147 కోట్లు

‘గోపల్ దిన్నె’ లింక్ కెనాల్ కు రూ.147 కోట్లు

సారథి న్యూస్​, నాగర్​ కర్నూల్​: శ్రీవారి సముద్రం సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ కోసం రూ.147కోట్లు మంజూరుచేసి ఆమోదం తెలిపినందుకు  సీఎం కేసీఆర్ కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. గురువారం నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ పట్టణంలోని టీఆర్​ఎస్​ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.. చిన్నంబావి, వీపనగండ్ల, పాన్ గల్ మండలాల రైతులకు జూరాల నుంచి గతంలో నీరులేక పంటలు ఎండిపోతున్నాయని విజ్ఞప్తి చేయడంతో సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్ […]

Read More
కళాకారులకు అండగా ఉంటాం

కళాకారులకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, గోదావరిఖని(పెద్దపల్లి): కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు కరోనా వ్యాప్తి కారణంగా కష్టాలు మొదలయ్యాయని, వారికి అండగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు. గురువారం ఆయన గోదావరిఖని పట్టణంలోని సీఐటీయూ ఆఫీసులో పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. కళాకారులంతా ఐక్యంగా ఉండాలని, త్వరలోనే వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ […]

Read More
హెల్త్​ సెంటర్​ పరిశీలన

హెల్త్​ సెంటర్​ పరిశీలన

​సారథి న్యూస్​, వెల్దండ: నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్​ సెంటర్​ను కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ గురువారం సందర్శించి ఆస్పత్రి భవన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని తెలియడంతో స్థానిక తహసీల్దార్ సైదులుతో కలిసి ఆయన పరిశీలించారు. ఒకవేళ ఆస్పత్రిని మార్చితే స్థానిక అనుకూలమైన భవనాలను కలియ తిరిగి చూశారు.

Read More
ఉపాధి పనుల పరిశీలన

ఉపాధి పనుల పరిశీలన

సారథి న్యూస్​, వెల్దండ: నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను హామీ ఎంపీడీవో వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఉప్పు అపర్ణ తిరుమల రావు గురువారం ప్రారంభించారు. సామాజిక దూరం పాటిస్తూనే పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు నాయక్, గ్రామ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

Read More
ఇతర రాష్ట్రాల నుంచి రానివ్వొద్దు

ఇతర రాష్ట్రాల నుంచి రానివ్వొద్దు

సారథి న్యూస్, కల్వకుర్తి: కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ డౌన్ ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన జిల్లాలోని వెల్దండ పోలీస్ చెక్ పోస్టును సందర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి రానివ్వకూడదని ఆదేశించారు. మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరూ బయటికి […]

Read More

పుట్టపర్తిలో కరోనా కలవరం

సారథి న్యూస్​, పుట్టపర్తి: అనంతరపురం జిల్లా పుట్టపర్తి పట్టణం ఒక్కసారిగా కరోనాతో కలవరపడింది. ప్రశాంతి నిలయం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ పోలీస్​ కానిస్టేబుల్​ కు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ తేలడంతో గురువారం ఆయనను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ట్రెయినీ కలెక్టర్ జాహ్నవి తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. గోపురం గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు దాదాపు వెయ్యి ఇండ్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలకు అసౌకర్యాలు […]

Read More
పేదలు ఆకలితో ఉండొద్దనే..

పేదలు ఆకలితో ఉండొద్దనే..

సారథి న్యూస్, చేవెళ్ల: లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు బిర్యానీ ప్యాకెట్లు, ఒక్కొక్కరికి నాలుగు గుడ్ల చొప్పున దాదాపు వెయ్యి మందికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ప్రజాసమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా మేలుచేస్తుందన్నారు. ప్రజలెవరూ ఆకలి చావులతో ఉండకూడదని ధైర్యం ఇచ్చారు. పోలీసు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.  

Read More