సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి తీసి, వర్మి కంపోస్టు ఎరువును వాడుతూ నాటాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియాకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పర్యవేక్షించాలని సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఆరో విడత హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మున్సిపల్‌శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి పట్టణాల పట్టణాల అభివృద్ధిపై చర్చ జరిగింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పట్టణాల్లో పార్కులు. ఫుట్ పాత్ రోడ్లు, టాయిలెట్లు, శ్మశాన వాటికల పనులపై సూచనలు చేశారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ […]
సారథిన్యూస్, ఆమన్‌గల్: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం ఎంతో గొప్ప కార్యక్రమమనిఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ వెంట ఆమనగల్ ఎంపీపీ అనితా విజయ్, టీఆర్ఎస్ నాయకులు జంగయ్య, బాబా, రవీందర్, శివలింగం, శేఖర్, అల్లాజీ, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, శేఖర్, నరేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు
సారథి న్యూస్, మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం పంచాయితీ నర్సరీని ఆకస్మిక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య సోమవారం పరిశీలించారు. ఈనెల 20వ తేదీన ఉంచి హరితహారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఉపాధి హామీ మేటీలకు శిక్షణ ఇచ్చి కూలీలను సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ కొండపల్లి విజయ, ఏపీవో శేఖర్ ఉన్నారు.