సామాజిక సారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామ సర్పంచ్ దార్ల కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విలువైన ఆట వస్తువులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక సారథి, వెల్దండ: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తిపై నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు చేయి చేసుకున్నారనే ప్రచారం సరికాదని అఖిలపక్ష నేతలు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి పట్ల కొంచెం గట్టిగా మాట్లాడారని తెలిపారు. ఎస్సై నర్సింహులు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాల ప్రజల పట్ల సౌమ్యంగా ఉంటారని తెలిపారు. సమస్య ఎలాంటిదైనా, ఎవరు స్టేషన్‌కు వెళ్లినా చాలా సావధానంగా వింటూ పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనపై బురద చల్లే ప్రయత్నంలో కొందరు […]
సామాజిక సారథి, వెల్దండ: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నేనున్నానని మానవతను చూపించారు ఓ యువనేత. చేసింది చిన్నసాయమే అయినా గొప్ప మనస్సును చాటుకున్నారు. నాగర్‌కర్నూల్‌జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ముంగల్శెట్టి రాములు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం కుటుంబసభ్యులు చాలా ఖర్చుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చెస్ట్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు నిమ్స్‌లో వైద్యం తీసుకున్నాడు. ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి.. అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్యువనాయకుడు, బాలాజీ ట్రస్ట్ […]
బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్ ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం చెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్స్పీడ్తో వస్తున్న కారు మొదట బైక్‌ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ […]
సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వలో నష్టపోయిన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములుకు బాధిత రైతు బొక్కల శ్రీను వినతిపత్రం అందజేశాడు. మంగళవారం వెల్దండకు వచ్చిన ఆయనకు సదరు రైతు కలిసి సమస్యలను వినతిపత్రంలో విన్నవించాడు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూనష్టపరిహారం అందేలా చూస్తానని హామీఇచ్చారు.
సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకుని మూడురోజులుగా స్థానిక భజన బృందం కళాకారులు ఆడిన పార్వతి కల్యాణం పౌరాణిక నాటకం అలరించింది. ప్రేక్షకులు జేజేలు పలికారు. హైటెక్యుగంలోనూ కళలను బతికిస్తున్న కళాబృందాన్ని పలువురు అభినందించారు. జానపద, పౌరాణిక నాటకరంగ ఇతివృత్తం, సారాంశాన్ని నేటి తరానికి అందించాలని కోరారు. కళ ప్రజల కోసం, మంచి కోసం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. నాటకంలో తారాకాసురుడిగా కొప్పు వెంకటయ్య, […]
సారథి న్యూస్, వెల్దండ: కరోనా విజృంభిస్తుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులుకు ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ ఎల్.శర్మన్, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, లాక్‌డౌన్‌ను మండల వ్యాప్తంగా ఆయన పకడ్బందీగా అమలుచేశారు. కరోనా బాధితులను గుర్తించి, వారికి చికిత్స అందించడంలో కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, కోవిడ్ 19 […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావుకు ఉత్తమ సర్పంచ్ అవార్డు దక్కింది. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ ఎల్.శర్మన్, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి చేతులమీదుగా అందుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, ట్యాంకులు, రైతు వేదిక, శ్మశాన వాటిక నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని సర్పంచ్ పి.వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ అవార్డు […]