Breaking News

రామడుగు

మామిడి తోటకు పెళ్లి

మామిడి తోటకు పెళ్లి

సారథి, రామడుగు: తొలిసారి కాపుకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి జరిపించారు. రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కడారి వీరయ్య తన సొంత వ్యవసాయ పొలంలో మూడెకరాల విస్తీర్ణంలో మామిడి తోట సాగుచేశారు. మొదటి సారి కోత దశకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి చేశారు. గురువారం పురోహితుడు రామస్వామి పంతులు సమక్షంలో శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణ మధ్య కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ తంతు నిర్వహించారు.

Read More
అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో నివారణకు కరీంనగర్ ​జిల్లా రామడుగు గ్రామపంచాయతీ పాలకవర్గం కొద్దిరోజులుగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగానే బుధవారం గ్రామంలోని ప్రధాన చౌరస్తాలతో పాటు వార్డుల్లో సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, పాలకవర్గ సిబ్బందితో కలిసి హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్ ధరించి […]

Read More
ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

సారథి, రామడుగు: రాజకీయాల్లో ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఎమ్మెస్సార్ సొంత గ్రామమైన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెస్సార్ తెలంగాణ వాదిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఏఐసీసీ కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా విశిష్టసేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెస్సార్ మరణం తెలుగు ప్రజలకు […]

Read More
ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్​ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి విధంగా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పెసరి రాజమౌళి నాయకులు అశోక్, పంజల జగన్మోహన్ మామిడి తిరుపతి, మాదం రమేష్, […]

Read More
స్టార్ యూత్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

స్టార్ యూత్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్టార్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడి గైని తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా అహ్మద్, ఉపాధ్యక్షుడిగా మాడిశెట్టి సంతోష్, బాసవేని సాగర్, కోశాధికారిగా షాదుల్లా, కార్యదర్శలుగా శ్రీను, శ్రీధర్, శంకర్, శ్రీనివాస్, లక్ష్మీపతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీను, అస్రత్, జబిఉల్లాఖాన్, బి.శ్రీను, ఓదేలు, తిరుపతి, ప్రదీప్, రమేష్, సింహచారి, అబ్దుల్లా, పోచమల్లు, లక్ష్మణాచారి, వేణు, రాజు, డి.వేణు, ప్రధాన సలహాదారుగా రాగం […]

Read More
వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రపల్లి గ్రామాల్లో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ రవీందర్ ప్రారంభించారు. వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజ కొనుగోలు సెంటర్​ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్లు ధ్యావ అనంతరెడ్డి, ఊట్కూరి అనిల్ రెడ్డి, లచ్చయ్య, కరుణాకర్, వీర్ల రవీందర్ రావు, సిబ్బంది మల్లేశం, నరేష్, ఇతర రైతులు పాల్గొన్నారు.

Read More
కరోనా వ్యాక్సిన్​కచ్చితంగా తీసుకోవాలె

కరోనా వ్యాక్సిన్​ కచ్చితంగా తీసుకోవాలె

సారథి, రామడుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల కచ్చురం లాగా సమన్వయంతో పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సూచించారు. 45 ఏండ్లు నిండిన వారంతా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. గురువారం కరీంనగర్ ​జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కల్గెటి కవిత అధ్యక్షతన జనరల్​బాడీ సమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైసర్లు వాడేలా ప్రజాప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో […]

Read More
బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

సారథి, రామడుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని బీజేవైఎం కరీంనగర్​ జిల్లా రామడుగు అధ్యక్షుడు దుర్శెటి రమేష్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య పాల్పడిన మహేందర్ యాదవ్, ప్రైవేట్​టీచర్ వెన్నం రవికుమార్ ఆత్మహత్యలపై అసమర్థ ప్రభుత్వ పాలనకు నిరసనగా రామడుగు మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను […]

Read More