సారథిన్యూస్, రామడుగు: రామడుగులో అద్భుతమైన శిల్పసంపద ఉన్నదని కరీంనగర్ అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రామడుగు మండల కేంద్రాన్ని సందర్శించారు. రామడుగుకు చెందిన శిల్పులు దేవతా విగ్రహాలు చేయడంలో నిష్ణాతులని కొనియాడారు. అనంతరం 200 ఏండ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడికోట ను సందర్శించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ పంజాల ప్రమీల, ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, రామడుగు: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో మాత్రం జెండా ఎగురవేయలేదు. కాగా ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జెండాపండుగను మరిచిపోయారని వారు విమర్శిస్తున్నారు. విజ్ఞానం పంచి మేధావులను తయారు చేసే గ్రంథాలయంలో జండా ఎగరవేయక పోవటం ఏమిటని గ్రంథపాలకుడి తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరోనా విపత్తు వేళ గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు డిమాండ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతం రైతులు వరినాట్లు వేస్తున్నారు. కరోనా భయంతో కూలీలెవరూ వ్యవసాయ పనులకు రావడం లేదు. రూ. 450 ఇస్తామన్నా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఇతర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, ట్రాక్టర్లను ఎక్కువ కూలీ ఇచ్చి తీసుకొస్తున్నారు. వరినాట్లు వేసేందుకు ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేల గుత్తకు […]
సారథి న్యూస్, రామడుగు: గ్రామాల్లో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సంప్రదాయ సాగుకే పరిమితమైన రైతులు.. నేడు ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వంగడాల ఎంపిక నుంచి.. కొత్త సాగు పద్ధతుల వరకు కూలీల ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. అందులో భాగంగా కరీంనగర్జిల్లా రామడుగు మండలంలోని చాలా గ్రామాల్లో అన్నదాతలు యంత్రాల సహాయంతో వరినాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ.మూడువేలు ఖర్చవుతోందని, తక్కువ సమయంలో ఎక్కువ పని అవుతోందని, పంట దిగుబడి కూడా బాగా వస్తుందని […]
సారథి న్యూస్, రామడుగు: ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి మలి వరకు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణకు జైకొట్టిన వారికి పబ్బతి పట్టి ఇమ్మతి ఇచ్చిన ఇమాందార్ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఎస్సై అనూష పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం జయశంకర్ చిత్రపటానికి పూలమాలల నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ర్టసాధనకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగులో మంగళవారం రామాంజనేయ ఆటో యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధానకార్యదర్శిగా ఉత్తెం దేవరాజ్, సహాయకార్యదర్శిగా అనంతరెడ్డి, కోశాధికారిగా మామిడి శ్రీను, రైటర్‌గా మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా మల్లేశం, రాగం కనకయ్య, ములుగురి రాజు, మామిడి రాజు, ముఖ్య సలహాదారులుగా పంజాల శ్రీను, కర్ణ శ్రీను తదితరులు ఎన్నికయ్యారు.
సారథి న్యూస్, రామడుగు: పేద యువతి వివాహానికి సహాయంచేసి ఓ ఎన్ఆర్ఐ పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడ్డారు. తన సొంత గ్రామానికి చేతనైన సాయం చేస్తుంటాడు. రామడుగుకు చెందిన జిట్టవేని రజిత అనే యువతికి కొంతకాలం క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. ఈ క్రమంలో ఆమె వివాహానికి సత్యం రూ.20వేల సాయం చేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ ప్రమీల జగన్మోహన్గౌడ్ కు పంపించగా ఆమె బాధిత యువతికి అందజేశారు. […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని శిక్షణా అధికారికి కరోనా సోకింది. దీంతో ఇటీవల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వారంతా ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. పరిసరాలను శుభ్రపరిచారు. రామడుగు మండలంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచించారు. ఇటీవల రామడుగు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వారంతా హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.