తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ముస్లింలు కులమత భేదాలకు తావులేకుండా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలని తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆకాంక్షించారు. ఇదే సంస్కృతిని సదా పాటించాలని కోరారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాస దీక్షలు ప్రత్యేకమైనవని అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో కూచకుళ్ల కొండమ్మ ఫంక్షన్ హాల్ లో […]
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం పండగలపై పడింది. అందులో భాగంగానే శుక్రవారం రంజాన్ నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంట్లోనే నమాజ్ చేసి సెమియా, బిర్యానీ వంటి వంటకాలు తయారుచేసి భుజించారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం బండపల్లిలో రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ రంజాన్ కానుకను ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం అందజేశారు. బండపల్లిలో స్థానిక సర్పంచ్ న్యాయ విజయ జార్జ్ ఆధ్వర్యంలో వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసారపు గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మల్యాల గంగానర్సయ్య, వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ గడ్డం సంజీవరెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.
సారథి, మానవపాడు: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని, అందరూ సుఖశాంతులతో జీవనం కొనసాగించాలని ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జామియా మసీదు ముతవల్లి మహబూబ్ పాషా కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ చేసుకోవాలని కోరారు.
మానవపాడులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు సారథి, మానవపాడు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, అదే విధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే యువ నాయకుడు కేటీఆర్కరోనా సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం బాగుండాలని మన మధ్య తిరుగుతున్నారని తెలిపారు. ఆయన క్షేమంగా […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమార్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, డైరెక్టర్ ఆఫ్ లేబర్ కోపరేటివ్ ఆఫ్ ఇండియా […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శనివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండడంతో ముస్లిలంతా ప్రార్థనలను, మతపరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కరోనా నేపథ్యంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానుండడంతో లాక్‌డౌన్ నిబంధనలు, సామాజికదూరం పాటించేలా చూడాలని జిల్లా ముస్లిం మతపెద్దలకు ఆయన కోరారు. శనివారం తెల్లవారుజాము నుంచి తొలి ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ఉండి […]