నాగర్కర్నూల్ నడిబొడ్డున ప్రభుత్వ జాగా ఆక్రమణ ఏడాదికేడాది పెరుగుతున్న అంతస్తులు 10 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం సామాజిక సారథి, నిఘా విభాగం: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ అండదండలుంటే చాలు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాల నడిబొడ్డున సైతం కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అధికార బలం, చెప్పినట్లు వినే అధికారగణం ఉంటే చాలు ప్రభుత్వ భూమి సైతం ప్రైవేట్వ్యాపారుల పరమవుతోంది. ఇదీ నాగర్కర్నూల్జిల్లా కేంద్రంలో […]
సామాజికసారథి, నాగర్కర్నూల్: నిత్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం. జిల్లాకు సంబంధించిన పాలనా అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ పాలన సాగించే ప్రాంగణం.. తుపాకీతో సినిమాలో హీరో లెవల్ లో గురిపెడుతూ సెల్ఫోన్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇది చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు. పైగా ఈ ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఇది ఎక్కడో కాదు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ఘటన […]
భువనగిరి కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వారించిన సిబ్బంది సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. బుడిగే మహేశ్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.ఆరువేలకు కొన్నాడు. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో లోన్లు, ఇతర సౌకర్యాలు రావడం లేదు. దీంతో మహేశ్ మనస్తాపం చెందాడు. […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: వివిధ సమస్యల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులు, అర్జీదారుల కోసం జిల్లా అధికార యంత్రాంగం మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మీసేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి కి సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.