ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ చట్టూ ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్లో సాలిగ్రామ్, టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్లో అనేక ఐటీ పరిశ్రమలు […]
ఆర్వో, జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ సిబ్బందికి అవగాహన సదస్సు ఈనెల 14 ఉదయం నుంచే లెక్కింపు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగానే జరుగుతుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ పీజే పాటిల్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య (డిఆర్డీఏ) భవనంలో కౌంటింగ్ కేంద్రంలో సిబ్బందికి శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల […]
టీఆర్ఎస్ ఖాతాలోకి ఆరు ఏకగ్రీ స్థానాలు 4 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం మిగతా 6 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ మెదక్బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్పోటాపోటీ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాలో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. […]
సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు.
11 నామినేషన్లకు, మూడు తిరస్కరణ వెల్లడించిన నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికల బరిలో ఎనిమిది నామినేషన్లు ఆమోదం పొందాయని, మూడు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా బుధవారం కలెక్టరేట్ లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో […]
నిన్న నామినేషన్.. నేడు ఎన్నిక రెండవసారి మండలిలోకి ప్రవేశం అభినందించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సామాజిక సారథి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీచేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఆమెకు లైన్ క్లియర్ అయింది. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్లోనే బుధవారం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా […]