సారథి న్యూస్, కర్నూలు: ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నగర శివారులోని వెంకాయపల్లె సమీపంలో తమకు పంపిణీ చేసిన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జాచేశారని, మీరే తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ఎదుట మొరపెట్టుకున్నారు. శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇళ్లస్థలాలను కబ్జాచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని, న్యాయం జరిగేలా చూస్తానని బాధితుకు హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనకు కృషిగిడుగు రామ్మూర్తి […]
సారథిన్యూస్, అమరావతి: పండితులు, కొన్నివర్గాలకే పరిమితమైన తెలుగుభాషను గిడుగు రామ్మూర్తి పంతులు సరళతరం చేశారని.. ఆయన సేవలను తెలుగుజాతి ఎప్పటికీ మరువబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్వీట్ చేశారు. గిడుగు రామ్మూర్తి గ్రాంథికంలో ఉన్న తెలుగు భాషనను వ్యవహారికభాషలోకి మార్చిన గొప్పవ్యక్తి అని పేర్కొన్నారు. యువత గిడుగు రామ్మూర్తి పంతులు గురించి […]
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది మొదలు.. టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వయస్సు మీదపడటం.. యువనేత లోకేశ్ మీద పార్టీ నేతలకు నమ్మకం లేకపోవడంతో కీలకనేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చందన రమేశ్ వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు […]
అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. రూ.ఐదులక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి వర్తింపు చేస్తామన్నారు. గురువారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆస్పత్రులకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తామన్నారు. 1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్నారు. వైద్యం ఖర్చు […]
సారథి న్యూస్, కడప: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ […]
సారథి న్యూస్, అనంతపురం: దివంగత మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో.. నాతో… వైఎస్సార్’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబర్ 2న అనూహ్యంగా వైఎస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. […]
సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్–19 నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైజానాథ్ విమర్శించారు. ప్రతి ఇంటిలో కోవిడ్ టెస్ట్చేస్తున్నారని, అంతటితో సరిపెట్టకుండా మందు అందజేసి, ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజాప్రతినిధులకు ఇసుకే కల్పవృక్షంగా మారిందన్నారు. సారా తయారీ, అక్రమ ఇసుక సరఫరాను అధికార పార్టీ నాయకులే […]
సారథి న్యూస్, కర్నూలు: పంటల బీమా పథకం 2018-19 రబీ (ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకం) పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పంటల బీమా పథకం కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ లబ్ధిపొందిన రైతు వై.మనోహర్ రెడ్డి కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంతో మాట్లాడారు. కాన్ఫరెన్స్‌లో గుమ్మనూరు జయరాం, కర్నూలు […]