న్యూఢిల్లీ: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామిపై.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని సామి ధ్రువీకరించాడు. ఇషాంత్ దురుద్దేశంతో అలా పిలువలేదని విండీస్ క్రికెటర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నానని, ఈసారి కలిసినప్పుడు ఇషాంత్ను మనసారా కౌగిలించుకుంటానన్నాడు. ‘ఏ ఆటగాడైనా సరే.. జాతి, వర్ణ వివక్షకు దూరంగా ఉండడం చాలా మంచిది. క్రికెట్లోనూ ఈ వివక్ష ఉండకూడదు. ఇషాంత్ కూడా ఉద్దేశపూర్వకంగా అలా పిలువలేదని […]
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఎవర్టన్ వీక్స్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరునెలల క్రితం తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన వృద్ధాప్య సమస్యలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1925లో బార్బడోస్‌లో పుట్టిన వీక్స్.. 1947–58 మధ్యకాలంలో విండీస్ తరఫున 48 టెస్టులు ఆడాడు. 58.61 సగటుతో 4,455 పరుగులు సాధించాడు. ఇందులో 15 శతకాలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1948లో.. 22 ఏళ్ల వయసులో ఇంగ్లండ్(కింగ్స్టన్ ఓవల్)పై టెస్ట్ అరంగేట్రం చేసిన వీక్స్.. […]
న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు విండీస్ క్రికెట్ జట్టు కూడా సమాయత్తమైంది. ఈ మేరకు ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి దిగనుంది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్‌పై దీనిని ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా ఈ లోగోను రూపొందించింది. ఇప్పటికే ప్రీమియర్ లీగ్‌కు చెందిన 20 ఫుట్‌బాల్ క్లబ్స్ ఈ లోగోను ధరించి జాతి […]
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి క్రికెట్ ఆడాలని ప్రపంచ దేశాల క్రికెటర్లంతా కోరుకుంటారు. ఇప్పుడు ఆడుతున్న వారైతే తమ అభిమానాన్ని ఏదో రకంగా చూపెడుతుంటారు. అదే కోవలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా.. మహీపై తన అభిమానాన్ని పాట రూపంలో వెల్లడించబోతున్నాడు. ‘మహీ సాంగ్’ పేరుతో తానే రాసి, కంపోజ్ చేసిన ఈ పాటను మహీ పుట్టిన రోజు జులై 7న విడుదల చేయనున్నాడు. దానికంటే ముందు పాటకు సంబంధించిన టీజర్‌ను సామాజిక […]
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు తనపై వర్ణవివక్ష వ్యాఖ్యలు చేశారని కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వెనక్కి తగ్గాడు. తన సహచరులు ప్రేమతోనే ‘కాలూ’ అని పిలిచారని ఓ ట్వీట్‌తో తేల్చేశాడు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ‘నన్ను కాలూ అని పిలిచిన వ్యక్తితో మాట్లాడా. మా మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. మ్యాచ్‌ల బాగా ఆడినప్పుడు, ప్రేమ ఎక్కువైనప్పుడు అలా పిలుస్తారని చెప్పాడు. ఇందులో వర్ణవివక్ష […]
లండన్: కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా.. క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకు రావాల్సిన బాధ్యత తమపై కూడా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. కేవలం డబ్బులు, ప్రజాదరణ కోసం తాము ఇక్కడికి రాలేదని స్పష్టం చేశాడు. ‘లాక్‌డౌన్‌తో ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోయారు. క్రికెట్ లేకపోవడంతో చాలా మంది అభిమానులు బాధపడుతున్నారు. కరోనా తగ్గుతుందని ఎదురుచూసే పరిస్థితి ఇప్పుడు లేదు. వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే క్రికెట్‌ను […]
న్యూఢిల్లీ: తనను ‘కాలూ’ అని పిలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు వర్ణ వివక్ష చూపెట్టారని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వెల్లడించాడు. మ్యాచ్ ల సందర్భంగా తనను, పెరీరాను ‘కాలూ’ అని సంబోధించేవారన్నాడు. దీనిపై సన్ రైజర్స్ ప్లేయర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. 2014లో ఇషాంత్, స్యామీతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ పంచుకోగా, అందులో స్యామీ పేరును ‘కాలూ’గా సంభోదించాడు. దీంతో ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. లక్ష్మణ్ […]
మాంచెస్టర్: అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు ఇంగ్లండ్, వెస్టిండీస్ మరో అడుగు ముందుకేశాయి. మూడు మ్యాచ్ ల సిరీస్ కోసం విండీస్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టింది. కరోనా నేపథ్యంలో మరో జట్టు వేరే దేశంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. రిజర్వ్ టీమ్, సహాయక సిబ్బంది మొత్తం మాంచెస్టర్ చేరుకున్నారు. కరీబియన్ దీవుల్లో ఉన్న ఆటగాళ్లందర్ని రెండు ప్రైవేట్ విమానాల్లో అంటిగ్వాకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అక్కడి నుంచి స్పెషల్ […]