Breaking News

VELDANDA

నష్టపరిహారం ఇప్పించండి సారూ..!

నష్టపరిహారం ఇప్పించండి సారూ..!

సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వలో నష్టపోయిన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములుకు బాధిత రైతు బొక్కల శ్రీను వినతిపత్రం అందజేశాడు. మంగళవారం వెల్దండకు వచ్చిన ఆయనకు సదరు రైతు కలిసి సమస్యలను వినతిపత్రంలో విన్నవించాడు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూనష్టపరిహారం అందేలా చూస్తానని హామీఇచ్చారు.

Read More
వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: కరోనా విజృంభిస్తుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులుకు ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్​ డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి ​చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, లాక్​డౌన్​ను మండల వ్యాప్తంగా ఆయన పకడ్బందీగా అమలుచేశారు. కరోనా బాధితులను గుర్తించి, వారికి చికిత్స అందించడంలో కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, కోవిడ్​ 19 […]

Read More
కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఉత్తమ సర్పంచ్​ అవార్డు దక్కింది. మంగళవారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ ​డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి చేతులమీదుగా అందుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, ట్యాంకులు, రైతు వేదిక, శ్మశాన వాటిక నిర్మాణంతో పాటు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు చేపట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని సర్పంచ్ ​పి.వెంకటేశ్వర్​ రావు తెలిపారు. ఈ అవార్డు […]

Read More
కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

సారథి న్యూస్, వెల్దండ: రెక్కల కష్టం బుగ్గిపాలైంది.. పైసాపైసా పోగేసి దాచుకున్న సొత్తు అగ్గిపాలైంది.. తాము నమ్ముకున్న కిరాణాషాపునకు మంటలు అంటుకోవడంతో బతుకంతా రోడ్డున పడినట్లయింది. నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన కొప్పు మల్లేష్, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఊరిలోనే డబ్బాలో చిన్నపాటి కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకుని.. అందులో చికెన్, గుడ్లు, కూల్​డ్రింక్స్, ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రమాదవశాత్తు బుధవారం అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి షాపు […]

Read More
చకచకా రైతువేదిక పనులు

చకచకా రైతువేదిక పనులు

సారథి న్యూస్, వెల్దండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా ఇటీవల నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయ సంబంధిత విషయాలను చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాల్లో షురూ అయ్యాయి. ఒకటి రెండు గ్రామాల్లో ఇప్పటికే పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయి. […]

Read More
హరితవనం.. శభాష్​

హరితవనం.. శభాష్​

సారథి న్యూస్​, వెల్దండ: నాగర్ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ గురువారం శ్రీశైలం– హైదరాబాద్​ హైవేపై ఉన్న వెల్దండ తహసీల్దార్​ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్​ సైదులుతో మాట్లాడారు. ఆఫీసు చుట్టూ పచ్చదనం వెల్లివెరిసేలా నాటించిన మొక్కలను చూసి కలెక్టర్​ ముగ్ధులయ్యారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణ పచ్చదనంతో పరిఢవిల్లడం ఎంతో అభినందనీయమని అభినందించారు. కార్యాలయ ఆవరణలో రాళ్లగుట్టపై ఖాళీగా ఉన్న స్థలంలో పూలతీగ మొక్కలను పెంచాలని కలెక్టర్ […]

Read More

కొట్రలో కరోనా కలవరం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ యువ డాక్టర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వైద్యాధికారులు గ్రామానికి వచ్చి ఆయనతో కాంటాక్ట్ ​అయిన వారి వివరాలు ఆరాతీశారు. సదరు డాక్టర్​ప్రస్తుతం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యచికిత్సలు అందించే వైద్యుల బృందంలో గత మూడు నెలలుగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోగులకు ట్రీట్​మెంట్​ అందించే క్రమంలో కరోనా మహమ్మారి […]

Read More

జర్నలిస్టులను ఆదుకోవాలి…….

సారథి న్యూస్​, వెల్దండ : కాటుకు బలైపోయినటువంటి జర్నలిస్టు మనోజ్ మరణం చాలా బాధాకమని, మనోజ్ మరణానికి కారణమైన మీడియా యాజమాన్యం,ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ‌రాష్ట్ర కోఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్ తెలిపారు. కరోన కాటుకు బలైన జర్నలిస్టు మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం,మీడియా యాజమాన్యం ఆదుకోవాలని అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,రూ.50 లక్షల ఎక్సగ్రెసియో ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం నుండి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ […]

Read More