Breaking News

US

అమెరికాలోనూ చైనా యాప్స్​ బ్యాన్​

వాషింగ్టన్‌: వివిధ దేశాల్లో చైనాపై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. చైనాకు చెందిన యాప్స్‌ను మన దేశం ఇప్పటికే బ్యాన్‌ చేయగా.. అమెరికా కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఆ దేశ విదేశాంగశాఖ సెక్రటరీ స్టేట్‌ మైక్‌పాంపియో అన్నారు. ‘అధ్యక్షుడి కంటే ముందే నేను ఈ విషయాన్ని చెప్పాలను కోవడం లేదు. కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం’ అని మైక్‌పాంపియో అన్నారు. ముఖ్యంగా టిక్‌టాక్‌ వంటి యాప్‌లు సేకరించే సమాచారంపై పలువురు అనుమానాలు వ్యక్తం […]

Read More

విమానాలు ఢీకొని 8 మంది మృతి

వాషింగ్టన్​: రెండు విమానాలు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్నది. విమానాలు కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయాయి. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్​ సాయంతో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.

Read More

అమెరికా అధ్యక్ష రేసులో హాలీవుడ్​ ర్యాపర్​

వాషింగ్టన్‌: తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు హాలీవుడ్ ర్యాప‌ర్‌‌ కాన్యే వెస్ట్ ప్ర‌క‌టించారు. కాన్యే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని కావడం గమనార్హం. ‘నేను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే నిర్మించుకుంటూ అమెరికా హామీల‌ను నెర‌వేర్చుకుందాం’ అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. పోటీకి సంబంధించి క్యానే ఎన్నిక‌ల బ్యాలెట్‌కు ఏదైనా ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారా అనే విష‌యం తెలియరాలేదు. కాగా 2018లో ట్రంప్ ఎన్నిక త‌ర్వాత‌ వెస్ట్ త‌న […]

Read More

ఆ యాప్​ల నిషేధం కరెక్టే

వాషింగ్టన్‌: భారత్​లో చైనా యాప్​లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్​టాక్​, షేర్​ఇట్​ సహా మొత్తం 59 చైనా యాప్​లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్​లో కొన్ని హానికరమైన యాప్​లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను […]

Read More

కష్టకాలంలో భగవద్గీత చదవండి

వాషింగ్టన్‌: ప్రపంమంతా అస్వస్థతతో కష్టకాలంలో ఉన్న సమయంలో భగవద్గీత చదివితే శాంతి, ధైర్యం కలుగుతుందని అమెరికాలోని మొదటి హిందూ లా మేకర్‌‌ తులసీ గబ్బార్డ్‌ అన్నారు. హవ్వాయి నుంచి ఒక వర్చువల్‌ కమెన్స్‌మెంట్‌లో మాట్లాడిన తులసీ ఈ విషయాలు చెప్పారు. రేపు ఏం అవుతుందో ఎవరికి తెలియదని, అందుకే ఇలాంటి టైమ్‌లో అందరూ భగవద్గీత చదవాలని సూచించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన భక్తి యోగా, కర్మ యోగా ద్వారా మనకు ధైర్యం, శాంతి రెండు కలుగుతాయని క్లాస్‌ […]

Read More

టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్​ మృతి

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్ (86) శనివారం అనారోగ్యంతో మరణించారు. 1958లో ఆస్ట్రేలియన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్స్​ను సొంతం చేసుకున్న కూపర్​ నంబర్‌ వన్‌ ర్యాంక్‌లోనూ నిలిచాడు. 1957లో ఆస్ట్రేలియా టీమ్‌ డేవిస్‌ కప్‌ను నిలబెట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. వెన్ను నొప్పి కారణంగా 1959లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన కూపర్‌.. ఆ తర్వాత బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. టెన్నిస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగాడు. ‘ప్లేయర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా కూపర్‌ అద్భుతమైన పాత్ర పోషించాడు. […]

Read More