జాక్ డోర్స్ స్థానంలో నియామకం పరాగ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్ న్యూయార్క్: మొన్న మైక్రోసాప్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్.. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను […]
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. #HBDMaheshbabu అనే హాష్ ట్యాగ్ పేరుతో గత 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. ఇంకా ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అవి మరింత పెరిగే అవకాశం ఉంది. మహేశ్‌బాబు ట్విట్టర్లో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారని మహేశ్‌బాబు అభిమాన సంఘాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ […]
అమెరికాలో ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ బిట్‌కాయిన్ అడ్రస్‌కి డాలర్లు పంపాలని మెసేజ్ ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామన్న ట్విట్టర్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు. హై ప్రొఫైల్, బ్లూ టిక్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. బిట్‌కాయిన్ అకౌంట్ అడ్రస్ పెట్టి డబ్బులు పంపితే రెట్టింపు చెల్లిస్తామని మెసేజ్ ఉంచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జాన్ బిడెన్, ఎలన్ మస్క్, జఫ్ బిజోస్ తదితరుల అకౌంట్లను హ్యాక్ చేసి ఆ మెసేజ్‌పెట్టారు. దీంతో […]
లాక్డౌన్ సమయంలో తాను వీడియో గేమ్స్‌కు అడిక్ట్ అయిపోయానంటూ యువనటి వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పుకొచ్చారు. షూటింగ్‌లు లేకపోవడంతో తాను వీడియోగేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఈ మేరకు వీడియో గేమ్ ఆడుతున్న ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. కాగా దీనిపై నెట్‌జన్లు మిశ్రమంగా స్పందించారు.