చెన్నై: నటి మీరా మిథున్ నిత్యానందపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన చాలా గొప్పవాడని.. మీడియా అనవసరంగా నిత్యానందపై తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘నిత్యానంద చాలా గొప్పవ్యక్తి. ఆయన గురించి అంతా దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే నేను నిత్యానంద సృష్టించిన కైలాసానికి వెళ్లి.. ఆయనను కలుసుకుంటాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం’ అంటూ మీరామిథున్ నిత్యానందను పొగడ్తల్లో ముంచెత్తింది. కాగా మీరా వ్యాఖ్యలపై నెట్‌జన్లు మండిపడుతున్నారు.
విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ వ్యవహారంపై సంచలన ట్వీట్లు పెట్టిన రామ్ పోతినేని వెనక్కి తగ్గాడు. ఇకమీదట తాను ఈ ఘటనపై ఎటువంటి ట్వీట్లు పెట్టబోనని మరో ట్వీట్పెట్టాడు. న్యాయంపై తనకు నమ్మకుందని చెప్పుకొచ్చాడు. నిజమైన దోషులకు శిక్షపడుతుందని భావిస్తున్నా అని చెప్పాడు. రామ్ ట్వీట్లు సంచలనంగా మారడంతో.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఓ రేంజ్లో విరుచుకుపడింది. స్వర్ణప్యాలెస్‌లో 10 మంది చనిపోతే స్పందించని రామ్.. ఇప్పడు ఆయన బంధువు మీదకొచ్చేసరికి నీతులు బోధిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు […]
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్.. భారతీయజనతాపార్టీకి సహకరిస్తోందని అమెరికాకు చెందిన ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనం ప్రచరించింది. ఇందుకోసం బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ పెట్టిన పోస్టులను ఆ కథనంలో ప్రస్తావించారు. కాగా ఈ కథనం ఆధారంగా కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది. రాహుల్‌గాంధీ కూడా ఫేస్బుక్ బీజేపీకి సహకరిస్తోందంటూ ఆరోపించారు. ఇన్నిరోజులకు అమెరికాకు చెందిన మీడియా వార్తలు ప్రచురిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ స్పందించింది. తమకు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని […]
కాన్పూర్: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుతం సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం కాన్పూర్ సమీపంలో పోలీసుల ఎన్కౌంటర్లో వికాస్‌దూబే మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం పలు నాటకీయపరిణామాల మధ్య ఉజ్జయినిలో వికాస్‌దూబే అరెస్టయ్యారు. అరెస్ట్‌కు కొద్దిగంటల ముందే వికాస్‌దూబేకు సన్నిహితులైన ఇద్దరు అనుచరులను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చిచంపారు పోలీసులు. కాగా వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌పై చాలా మంది ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చెబుతున్న వివరణ […]