సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ డెయిరీ పేరుతో ఉన్న వాహనంలో తరలిస్తున్న సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. డ్రైవర్ అనిల్, ఓనర్ తిరుపతిని అదుపులోకి తీసుకుని వేములవాడ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రమేష్, తిరుపతి, రాజేష్ పాల్గొన్నారు.
సారథి, వనపర్తి: కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. గురువారం పెబ్బేరులో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అభినందనలు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదని, ఇంటింటి సర్వేలో జ్వరపీడితులను గుర్తించి […]
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు ఎక్కడెక్కడ ఎన్ని స్థలాలు ఉన్నాయో జిల్లాలవారీగా వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని స్థలాలు కబ్జాకు గురయ్యాయో, ఆక్రమణలు జరిగాయో, నిర్మాణాలు చోటుచేసుకున్నాయో జూన్ 10వ తేదీ వరకు వివరాలు సమర్పించాలని సూచించింది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను బెంచ్ గురువారం విచారించింది. వక్ఫ్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 2,186 వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. టాస్క్ ఫోర్స్ […]
సారథిన్యూస్, రామగుండం: నాటుసారాను తయారుచేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గుడాంబా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల మండలం కొలనూరు చెరువు సమీపంలో గుడుంబా స్థావరాలపై దాడులు జరిపి గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన ఆరువందల లీటర్ల బెల్లం పానకం, 50 కిలోల బెల్లం, నాటుసారా తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది భారీగా నకిలీ విత్తనాలు, నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిట్టు తిరుమల్, కుమార్ అనే ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.