Breaking News

TAMIL

బోల్డ్ రోల్‌ కు శ్రియా సై

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై యేళ్లు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తరగని హీరోయిన్ శ్రియా సరన్. ఏ పాత్ర లోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె స్టైల్. పెళ్లి చేసుకుని సెటిలైనా ప్రస్తుత సీనియర్ హీరోలకి ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా. రీసెంట్ గా శ్రియా లీడ్ రోల్ లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఇంకో వైపు ‘ఆర్ఆర్ఆర్’ భారీ ప్రాజెక్ట్లో కూడా నటిస్తోంది. అందుకు చాలా హ్యాపీగా […]

Read More

యువనటుడితో గుత్తా జ్వాల ఎంగేజ్​మెంట్

తమిళ హీరో విష్టు విశాల్​ను బాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లాడనున్నారు. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్​మెంట్​ కూడా చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం విష్ణు ట్విట్టర్​లో ఫొటోలు షేర్​ చేశాడు. రెండేళ్ల నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే జ్వాలను తాను పెళ్లిచేసుకోబోతున్నట్టు విష్ణు ట్విట్టర్​లో పేర్కొన్నాడు. ‘జ్వాలా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం ఆశావహ దృక్ఫథంతో ముందుకెళదాం. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అంటూ విష్ణు ట్వీట్​ చేశాడు.

Read More

హాస్యనటి ఎంగేజ్​మెంట్​.. ప్రియుడితోనే

ప్రముఖ హాస్యనటి, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విద్యుల్లేఖ రామన్​ త్వరలోనే తన ప్రియున్ని పెళ్లి చేసుకోబోతుంది. కొంత కాలంగా ఆమె ప్రముఖ ఫిట్​నెస్​ ట్రైనర్​ సంజయ్​తో ప్రేమలో పడింది. కాగా మంగళవారం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్​లో వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్​మెంట్​ జరిగింది. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వివాహం నిశ్చయమైంది. కొంతమంది ప్రముఖులు, సమీప బంధువుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్​మెంట్ పిక్స్​ వైరల్​గా మారాయి.

Read More

మిల్కీబ్యూటీకి బంపర్​ ఆఫర్​

ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా వెలిగిన తమన్నా.. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు తమిళంలో ఓ బంపర్​ ఆఫర్​ వచ్చింది. మురగదాస్​ దర్శకత్వంలో ఇలళదళపతి విజయ్​ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో హీరోయిన్​గా తమన్నా ఎంపికైంది. కొంతకాలంగా చిన్నహీరోలతో కూడా నటిస్తున్న తమన్నాకు ప్రస్తుతం ఈ భారీ ఆఫర్​ దక్కడంతో చాలా సంతోషంగా ఉందట. ఈ సినిమా హిట్​ అయితే తమన్నాకు మరిన్ని అవకాశాలు రావొచ్చని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక […]

Read More

అభిమానుల కోసమేనట..

బాలనటిగా ఇండస్ట్రీకొచ్చినా వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి మీనా. అయితే దానికి బ్రేక్ చెప్పాలనుకుంటున్నా.. నెగెటివ్, చాలెంజింగ్ పాత్రలను కూడా చేయాలనుకుంటున్నానని గతంలో ‘అన్నాత్త’ సినిమా ఓపెనింగ్ సమయంలో తన మనసులోని అభిప్రాయాలను చెప్పింది మీనా. తనకి తగ్గా పాత్రలు చెయ్యాలి అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఏ పాత్రైనా చెయ్యడానికి సిద్ధపడుతోందట. ఎందుకంటే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని.. ట్రెండ్ కి తగ్గట్టుగా […]

Read More

తమిళ జెర్సీలో సీనియర్​ భామ

నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ చిత్రం భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. క్రికెట్​ నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నది. ప్రస్తుతం జెర్సీ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్​ చేస్తున్నారు. హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. తమిళంలో విష్ణు విశాల్ చేస్తున్నాడు. అయితే జెర్సీలో కథనాయికగా చేయడానికి హీరోయిన్స్​ […]

Read More

తుపాకీ 2లో మిల్కీబ్యూటీ

ఒకప్పడు టాలీవుడ్​, కోలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​గా వెలుగొందిన మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. కొత్తవాళ్లు రావడంతో తమన్నా వెనకబడిపోయింది. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్​లో ఆఫర్​ దక్కించుకున్నట్టు సమాచారం. ఇళయదళపతి విజయ్​ హీరోగా .. మురగదాస్​ తుపాకి చిత్రానికి సీక్వెల్​ తీయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్​గా తమన్నాను ఎంపికచేసినట్టు సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్​. తమన్నాతోపాటు కాజల్​ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఓ […]

Read More

మురళీధరన్​గా విజయ్​ సేతుపతి

తన స్పిన్​ మాయజాలంతో ప్రపంచ క్రికెట్​ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీలంక దిగ్జజ బౌలర్​ ముత్తయ్య మురళీధరన్​ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. తమిళనటుడు విజయ్​ సేతుపతి ఈ చిత్రంలో మురళీధరన్​ పాత్రను పోషించబోతున్నాడు. మురళీధరన్​ బౌలింగ్​ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతడి బౌలింగ్​ అంటే ప్రముఖ ఆటగాళ్లు సైతం వణికిపోతుంటారు. కీలకసమయంలో వికెట్లు పడగొట్టి జట్టును గట్టెంకించడం మురళీధరన్​ ప్రత్యేకత. అలాంటి గొప్ప క్రికెటర్ జీవిత కథను సినిమా రూపంలో […]

Read More