Breaking News

SINGER

బాలూ వ్యక్తిత్వం శిఖరాయమానం! అందుకు ఈ లేఖే సాక్ష్యం

ఇటీవలే మనందరనీ విడిచిపెట్టి వెళ్లిపోయిన ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఎంతటి నిరాడంబరుడో అంతటి మర్యాదస్తుడు. ఎంతటి సంస్కార వంతుడో అంత ప్రతిభాశాలి. ఎంతమంది కొత్త కళాకారులను ప్రోత్సహించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో పాడుతున్న చాలా మంది సింగర్స్​ ఆయన ప్రోద్బలంతో వచ్చినవారే. నిజానికి ఆయన ప్రతిభ అసమానం. కేంద్రప్రభుత్వం ఆయనకు 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. అంతేకాక ఆయన ఆరు సార్లు జాతీయ స్థాయి […]

Read More

చెన్నైలో బాలు అంత్యక్రియలు

ఎస్పీ బాలు భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్​ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే బాలూను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, సినీప్రియులు, తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో తీవ్రమైన ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. అయితే అభిమానుల […]

Read More
గొప్ప వ్యక్తిని కోల్పోయాం: సీఎం కేసీఆర్​

గొప్ప వ్యక్తిని కోల్పోయాం: సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: సినీనేపథ్య గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యం మృతి పట్ల సీఎం కె.చంద్రశేఖర్​రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీలోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ […]

Read More

ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు కరోనా నెగిటివ్ వచ్చింది. కోవిడ్-19 లక్షణాలతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు.. దాదాపు నెల రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో బాలుకు నెగిటివ్ గా తేలిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. సోమవారం శుభవార్త చెప్తానని ఆయన రెండు రోజుల క్రితమే ఒక ట్వీట్ పెట్టారు. అన్నట్టుగానే చరణ్ స్పందిస్తూ.. ‘నాన్న ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. మరో వారం […]

Read More

సింగర్​ కారుణ్య తల్లి కన్నుమూత

ప్రముఖ సింగర్​ కారుణ్య ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు వాడైన కారుణ్య ఇండియన్​ ఐడల్​ రన్నరప్​గా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారుణ్య మాతృమూర్తి జానకి కొంతకాలంగా కేన్సర్​తో బాధపుడుతున్నట్టు సమాచారం. ఆమె కేంద్రప్రభుత్వం సంస్థ బీడీఎస్​ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు, గాయకులు సంగీతదర్శకులు కారుణ్యకు ఫోన్​చేసి ఓదార్చారు. ఆయన మాతృమూర్తి మృతికి సంతాపం తెలిపారు.

Read More

నెమ్మదిగా కోలుకుంటున్న బాలు

చెన్నై: గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్​ తెలిపారు. కరోనాతో ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చేరిన బాలూ ఆరోగ్యం క్రమంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఎక్మా పరికరంతో కృత్రిమశ్వాసం అందిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, తెలంగాణలోని బాలు అభిమానులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందారు. ఆయన తొందరగా కోలుకోవాలని మృత్యుంజయ యాగాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం […]

Read More

బాలు త్వరగా కోలుకోవాలి

సారథిన్యూస్​, హైదరాబాద్​: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్​ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని […]

Read More

మాళవిక కూతురుకు కరోనా

కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సింగర్లు సునీత, మాళవిక కూడా కరోనా బారినపడ్డారు. అయితే తాజాగా మరో విషాధకరమైన విషయం ఏమిటంటే.. మాళవిక రెండేండ్ల కుమార్తెకు కరోనా సోకింది. దీంతో మాళవిక కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మాళవిక తల్లిదండ్రులు కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా హోంఐసోలేషన్​లో ఉండి చికిత్సపొందుతున్నారు. […]

Read More