Breaking News

SACHIN

ద్రవిడే ఒప్పించాడు

ద్రవిడే ఒప్పించాడు

న్యూఢిల్లీ: ప్రపంచకప్ 2007 టీ20 జట్టుకు దూరంగా ఉండేలా సచిన్, గంగూలీని.. నాటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఒప్పించాడని అప్పట్లో టీమ్ మేనేజర్​గా ఉన్న లాల్​చంద్​ రాజ్​పుత్​ తెలిపాడు. యువకులకు అవకాశం ఇవ్వడం కోసమే అలా చేశాడన్నాడు. దీనికి సచిన్, గంగూలీ పెద్ద మనసులో అంగీకరించారన్నాడు. ‘అప్పుడు ఇంగ్లండ్​తో సిరీస్​కు ద్రవిడ్ కెప్టెన్​గా ఉన్నాడు. కొంత మంది ఆటగాళ్లు అక్కడి నుంచి నేరుగా జొహనెస్​బర్గ్​ వెళ్లారు. యువ క్రికెటర్లకు అవకాశం కోసం సీనియర్లు తప్పుకోవాలని అనుకున్నారు. దీనికి […]

Read More

క్రికెట్​లో బంధుప్రీతి లేదు

న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లుగా క్రికెట్​లో బంధుప్రీతి లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. దిగ్గజ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్​ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించాడు. నైపుణ్యం లేకుండానే అర్జున్​కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారన్న వాదనను తోసిపుచ్చాడు. అదే జరిగితే అర్జున్, రోహన్ గవాస్కర్​ టీమిండియాలో మంచి స్థితిలో ఉండేవారన్నాడు. టాలెంట్ లేకుండా క్రికెట్​లో రాణించడం కష్టమన్నాడు. ‘క్రికెట్లో బంధుప్రీతి అనే ప్రస్తావనే లేదు. అలా ఉంటే […]

Read More
ద్రవిడే.. నంబర్​వన్​

ద్రవిడే.. నంబర్​వన్​

న్యూఢిల్లీ: గణాంకాలు, రికార్డుల పరంగా భారత్​లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్​మెన్​ ఎవరంటే ఠక్కున సచిన్ టెండూల్కర్ పేరు చెబుతారు. కానీ అభిమానులు మాత్రం మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్​కు ఓటేశారు. 50 ఏళ్లలో భారత క్రికెట్​లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్​మెన్​ ఎవరని విజ్డెన్ ఇండియా ఓ ఆన్​లైన్​ సర్వే నిర్వహించింది. మొత్తం 16 మంది పోటీపడగా చివరకు వచ్చేసరికి సచిన్, ద్రవిడ్, గవాస్కర్, కోహ్లీ నిలబడ్డారు. వీళ్ల మధ్య ఓటింగ్ రేస్ హోరాహోరీగా సాగింది. ఆఖరిలో సచిన్​ను […]

Read More

కెప్టెన్సీని సచిన్ వద్దన్నాడు

న్యూఢిల్లీ: కెప్టెన్​గా వైఫల్యం.. దాంతో వచ్చిన ఒత్తిడి వల్ల బ్యాటింగ్​లోనూ ఫామ్ కోల్పోవడంతో.. సారథిగా కొనసాగడానికి సచిన్ టెండూల్కర్ ఇష్టపడలేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ చందూ బోర్డే వెల్లడించాడు. దీంతో సౌరవ్ గంగూలీని సారథిగా నియమించాల్సి వచ్చిందన్నాడు. ఇందులో ఎలాంటి రహస్యం లేకపోయినా.. అప్పట్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నాడు. ‘అప్పట్లో ఆస్ట్రేలియా టూర్​కు సచిన్​ టెండుల్కర్​ ను కెప్టెన్​గా పంపించాం. కానీ అక్కడ సరైన ఫలితాలు రాకపోవడంతో.. ఇండియాకు వచ్చిన వెంటనే సారథిగా కొనసాగలేనని […]

Read More

ఆ రెండు తప్పులు నావే: బక్నర్

న్యూఢిల్లీ: ఔట్ కాకున్నా.. రెండుసార్లు సచిన్ టెండూల్కర్ విషయంలో తప్పుడు నిర్ణయాలు ఇచ్చానని ప్రఖ్యాత అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించాడు. ఈ రెండు పొరపాట్లకు తానే బాధ్యుడినని వెల్లడించాడు. అయితే తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడని, అనుకోకుండా అలా జరిగిపోయాయన్నాడు. ‘సచిన్ నాటౌటైనా రెండుసార్లు పొరపాటుగా ఔటిచ్చా. తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడు. అలా చేస్తే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుంది. 2003 ఆసీస్​లో నిర్వహించిన గబ్బా టెస్ట్​ మ్యాచ్​లో జేసన్ గిలెస్పీ […]

Read More

ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే

న్యూఢిల్లీ: సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. కెప్టెన్​గా మాత్రం విజయవంతం కాలేకపోయాడనే ఓ విమర్శ మాత్రం అలాగే ఉంది. అయితే దీనిపై చాలా మంది భిన్న అభిప్రాయాలను వెల్లడించారు. 1983 ప్రపంచకప్ విజేత టీమ్ సభ్యుడు మదన్​లాల్​ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. సారథిగా సచిన్​ విఫలమయ్యాడని తాను అంగీకరించనని చెప్పాడు. ‘సచిన్ గొప్ప సారథి. కాదని ఎవరు చెప్పినా వాళ్లకు ఆటపై అవగాహన లేనట్లే. ఓ కెప్టెన్​గా అతను […]

Read More

అప్పుడే వదిలేద్దామనుకున్నాడు

న్యూఢిల్లీ: ఫామ్ లేకపోవడం, సరైన బ్యాటింగ్ స్థానం దొరకపోవడంతో 2007లోనే దిగ్గజ బ్యాట్స్​మెన్ సచిన్ టెండూల్కర్ కెరీర్​ గుడ్ బై చెప్పాలనుకున్నాడని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ వెల్లడించాడు. అప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాస్టర్​కు వన్డే ప్రపంచకప్ నుంచి భారత్ లీగ్ దశ నుంచి నిష్ర్కమించడం మరింత భారంగా మారిందన్నాడు. ‘నేను బాధ్యతలు చేపట్టేనాటికి భారత జట్టులో పరిస్థితులు బాగాలేవు. వాటిని అధిగమించడానికి కాస్త సమయం పట్టింది. కానీ అప్పటికే ప్రయోగాల వల్ల ఆటగాళ్లంతా […]

Read More

ఆస్ట్రేలియాలో సచిన్, కోహ్లీ వీధులు

మెల్​బోర్న్: ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లకు సంబంధించిన వస్తువులు, ఫొటోలను అభిమానులు తమ ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. అలాంటి క్రికెటర్లలో సచిన్, కపిల్, కోహ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఆసీస్​లో అభిమానులు మరో అడుగు ముందుకేస్తూ తమ వీధులకు క్రికెటర్ల పేర్లను పెట్టుకున్నారు. మెల్​బోర్న్​లోని రాక్​బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్​లో వీధులకు ‘టెండూల్కర్ డ్రైవ్’,‘కోహ్లీ క్రీసెంట్’, ‘దేవ్ టెర్రెస్’ అని పేర్లు పెట్టుకున్నారు. మెల్టన్ కౌన్సిల్లోకి […]

Read More